ఒకసారి దెబ్బతిని కూడా రిపబ్లిక్ డే కే వస్తున్నాడు

Update: 2018-01-17 09:00 GMT

ఎన్ని సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ అందుకునే స్థాయి విజయం అందుకోవటంలో వరుసగా విఫలమవుతూనే వస్తున్న మంచు విష్ణు ఆ మధ్య కాలంలో కామెడీ ఇంటెర్టైనెర్స్ తో మోస్తరు ఫలితాలని సొంతం చేసుకున్నప్పటికీ ఆ జోనర్ లో కూడా ప్రతి ప్రయత్నంతో మెప్పించలేకపోతున్నాడు. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర తో పాటు తాను ప్రధాన పాత్ర పోషించిన గాయత్రి చిత్రాలపై మంచు విష్ణు భవిష్యత్ చిత్రాల ఎంపిక ఆధారపడి ఉన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.

ఇప్పటికే ఆచారి అమెరికా యాత్ర చిత్ర విడుదల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ చిత్రం విడుదల చేయబోతున్నాడు మంచు విష్ణు. గత ఏడాది సరిగ్గా అదే రోజున విష్ణు నటించిన లక్కున్నోడు చిత్రం విడుదలై డిసాస్టర్ గా నిలిచింది. కాగా తిరిగి ఈ ఏడాది అదే రోజున తన తాజా చిత్రం విడుదలకి సన్నాహాలు చేసుకుంటున్నాడు విష్ణు. ఇలాంటి రిలీజ్ డేట్ సెంటిమెంట్స్ కి దూరంగా ఉంటున్న ఈ హీరోకి ఈ సారైనా రిపబ్లిక్ డే కలిసి వస్తుందని ఆశిద్దాం.

Similar News