ఒక హీరోయిన్ తో పెళ్లి ఫెయిల్... మరో హీరోయిన్ తో లవ్

Update: 2017-01-27 21:30 GMT

తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అరుదుగా చిత్ర నిర్మాణాలు చేపట్టే మద్రాస్ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వరుణ్ మానియన్ రెండు సంవత్సరాల క్రితం వరకు కోలీవుడ్ వర్గాలలో కూడా అందరికి సుపరిచితం కాదు. కానీ దక్షిణాది చిత్రాలతో బాగా క్రేజ్ వున్న కథానాయిక త్రిష తో ప్రేమ వ్యవహారం తో యావత్ సౌత్ ఇండియా లో పాపులర్ అయిపోయాడు. అనంతరం త్రిష తో జరిగిన నిశ్చితార్ధం అనతి కాలంలోనే పెటాకులు కావటంతో తిరిగి మరోసారి వార్తల్లోకి ఎక్కిన వరుణ్ మానియన్ తరువాతి కాలంలో ఇప్పటివరకు లైం లైట్ లో లేరు. ఇప్పుడు వరుణ్ మానియన్ మరొక ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతుండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

త్రిష తో జరిగిన నిశ్చితార్ధం పెటాకులు అవటానికి కారణాలు ఏవి బైటకి ఇరు వైపుల వారు బహిర్గతం చేయలేదు. ఆ వ్యవహారం తరువాత కొంత కాలం సైలెంట్ గా వున్న వరుణ్ మానియన్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి బిందు మాధవితో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఆధారాలు సమకూర్చే పని వరుణ్ మానియన్ తన భుజస్కంధాలపై వేసుకునట్టుగా బిందు మాధవితో చనువుగా మెలిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పటికే సరైన సినిమా అవకాశాలు అందక కెరీర్ క్లిష్ట పరిస్థితిలో ఉండటంతో బిందు మాధవి కూడా త్వరలో వివాహం చేసుకోవటానికి ఫిక్స్ ఐయి వరుణ్ మానియన్ తో జీవితం పంచుకోవాలని నిశ్చయించుకుందని సమాచారం.

Similar News