ఐసియులో విష్ణు!!

Update: 2017-07-30 13:21 GMT

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్లో బిజీగా వున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ మలేషియా లో జరుపుకుంటుంది. అయితే 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్ లో మంచు విష్ణు ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ లో భాగంగా బైక్ రేసు సీన్ షూట్ చేస్తుండగా.. అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. బైక్ రేసు సీన్ చేస్తుండగా... బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వెంటనే మంచు విష్ణు ని మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రికి తరలించింది చిత్ర బృందం.

ఆసుపత్రిలో విష్ణు ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే విష్ణుకి తీవ్ర స్థాయిలో గాయాలు అవలేదని... కొద్ది కొద్ది గాయాలతో విష్ణు బయట పడ్డాడని చెబుతున్నారు. మరి ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో మంచు విష్ణు నటిస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర షూటింగ్ కి కొన్నాళ్ళు వాయిదాపడే అవకాశం వుంది.

Similar News