ఏమిటి.. ఈ నాటకీయ పరిణామాలు!

Update: 2018-04-26 05:55 GMT

బాలకృష్ణ హీరోగా.. నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి ఆ చిత్ర దర్శకుడు తేజ బయటికి వెళ్ళిపోయి ఎన్టీఆర్ టీమ్ కి షాకిచ్చాడు. అంతటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని సినిమాగా తాను తెరకెక్కించలేనని... అంతటి మహత్కార్యాన్ని తాను నిర్వర్తించలేనని... అందుకే ఈ 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి తప్పుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని షాక్ లో పడేసాడు తేజ. అలాగే తన తరవాత ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లుగా తేజ ఒక ఫీలర్ కూడా వదిలాడు.

అసలు తేజ కి ముందు తెలియదా... ఎన్టీఆర్ అంతటి మహోన్నత వ్యక్తి జీవిత కథ ఎలా వుంది అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. ఆయన నట, రాజకీయ జీవితాల్లో ఎంతటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో అనేది అందరికి తెలిసిందే. మరి 'ఎన్టీఆర్' బయో పిక్ విషయంలో అనేక సమాచారం సేకరించినప్పుడు రాని భయం సినిమా ఆఫీషియల్ గా సెట్స్ మీదకెళ్లాకే గుర్తొచ్చిందా...? లేదా తేజ భయపడుతున్నాడా? ఎన్టీఆర్ బయో పిక్ తో తాను ఇరుకుంటానని..? ఏమో విషయమేదైనా గాని తేజ సినిమా సెట్స్ మీదకెళ్ళకముందు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రెండు రోజులపాటు షూటింగ్ కంప్లీట్ చేసాక... అందులోను మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న టైం లో ఉన్నట్టుండి ఇలా 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి తేజ బయటికి రావడమనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

మరి ఎన్టీఆర్ బయో పిక్ ఓపెనింగ్ రోజే కె రాఘవేంద్ర రావు గారు నవ్వుతూ... ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే బావుండేది అని తనకి ఈ సినిమా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేసాడు. మరి అసలు తేజ 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి అర్దాంతరంగా తప్పుకోవడం గురించి బాలకృష్ణ ఇంతవరకు ఎటువంటి స్పందన తెలపలేదు. మరి తేజ తర్వాత నిజమ్గానే ఎన్టీఆర్ బయో పిక్ ని కె రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తాడా? లేదా మరో డైరెక్టర్ లైన్ లోకొస్తాడో? అన్నది మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న సస్పెన్స్.

Similar News