ఏప్రిల్‌ 7వ తేదీనే నాగ్‌కు డెడ్‌లైన్‌....!

Update: 2016-03-30 15:31 GMT

నాగ్‌-కార్తీల కాంబినేషన్‌లో వచ్చిన 'ఊపిరి' చిత్రానికి అద్భుతమైన టాక్‌ వచ్చినప్పటికీ తెలుగురాష్ట్రాల్లో అనుకున్న రేంజ్‌లో కలెక్షన్లు రావడం లేదని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఈచిత్రం కలెక్షన్లకు ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు, తీవ్రమైన ఎండలు గండికొడుతున్నాయని అంటున్నారు. అయినా కూడా ఈచిత్రం ఓవర్‌సీస్‌లో మాత్రం అదరగొడుతోంది. వాస్తవానికి ఓవర్‌సీస్‌లో ఎంటర్‌టైనర్స్‌కు, ఫీల్‌గుడ్‌ మూవీస్‌కు, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్స్‌కు ఆదరణ ఎక్కువ. దీంతో నాగార్జున నటించిన 'మనం' చిత్రం నుండి ఓవర్‌సీస్‌లో నాగ్‌కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' కూడా లైఫ్‌ టైం వసూళ్లు 5.50 కోట్ల రూపాయలు సాధించింది. ఈ కలెక్షన్లను 'ఊపిరి' చిత్రం ఓవర్‌సీస్‌లో మూడు రోజుల్లోనే క్రాస్‌ చేసింది. ఓవర్‌సీస్‌లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం మిలియన్‌ మార్క్‌ను అందుకొందని సమాచారం. మరి ఓవర్‌సీస్‌లో పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ వంటి స్టార్స్‌కు నాగ్‌ చెక్‌పెడతూ, వారితో సరిసమానంగా దూసుకెళ్తున్నాడని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఈచిత్రం కలెక్షన్లు కేవలం ఏప్రిల్‌ 7వరకు మాత్రమే సాధ్యమని, ఏప్రిల్‌ 8వ తేదీన వవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' విడుదలకు సిద్దంగా ఉండటంతో అప్పటివరకే 'ఊపిరి'కి వెసులుబాటు ఉందని, 'సర్దార్‌' రిలీజ్‌ అయితే మాత్రం 'ఊపిరి' కలెక్షన్లు పడిపోవడం ఖాయమంటున్నారు.

Similar News