ఏపీ ప్రభుత్వానికి గుణశేఖర్ సూటి ప్రశ్న!!

Update: 2017-11-16 08:00 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 2014 - 2015 - 2016 సంవత్సరాలకు నంది అవార్డ్స్ ప్రకటించింది. అయితే ఈసారి ఈ అవార్డ్స్ ఎక్కువుగా నందమూరి ఫామిలీకే రావడం చాలా మందిని డిజప్పాయింట్ చేసింది. మూడేళ్లకు సరిపడా ఒకేసారి నంది అవార్డ్స్ కేవలం నందమూరి ఫామిలీకె ఇచ్చారని మెగా ఫామిలీని పక్కన పెట్టేశారని... ఇప్పుడు సోషల్ మీడియా లో విమర్శలు మొదలయ్యాయి. ఇక డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ట్వీట్ నోట్ ద్వారా ప్రశ్నించాడు.

రుద్రమదేవికి ఇవ్వరా?

తెలుగు జాతి గర్వపడేలా రుద్రమదేవి చిత్రాన్ని మనకి తెలుగు ప్రేక్షకులకి డైరెక్టర్ గుణశేఖర్ అందించాడు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు ఒకేసారి నంది అవార్డులను ప్రకటించింది. అయితే అసలు రుద్రమదేవి సినిమా సినిమా విడుదల సమయంలో పన్ను మినహాయింపు ఇవ్వలేదు అని అడగటం తప్పా అంటూ అప్పట్లో సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే ప్రశ్నించాడు. అయితే తాజాగా రుద్రమదేవి ఉత్తమ చిత్రంగా మూడు క్యాటగిరీల్లో ఎక్కడా నిలవకపోవడం..కనీసం జ్యూరి అవార్డు కూడా నోచుకోకపోవడం ఏంటని ప్రశ్నించాడు.

చరిత్రను వెలికితీస్తే...

చరిత్రను వెలికితీసి సినిమా తీస్తే దానికి అవార్డు ఇవ్వడం ఎందుకు అనుకున్నారా అంటూ సెటైర్ వేశాడు. మీరు అలాగే అనుకుంటే రుద్రమదేవి వంటి సినిమాను తీసినందుకు క్షమించండి అంటూ మనస్సులోని బాధను వ్యక్తపరిచాడు. అయితే గుణశేఖర్ చేసిన ఈ ట్వీట్ నోట్ ని సినీ రంగం నుండి చాలా మంది ప్రముఖులు అభినందించారు.

Similar News