ఏదైనా పవన్ కే సాధ్యం!!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక రాజకీయనాయకుడిలా పంచె కట్టు.. తెల్ల లాల్చీ, పైజామా అంటూ లుక్ మార్చేశాడు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఫిజిక్ మీద దృష్టి పెట్టకపోయినా [more]

Update: 2020-11-05 05:13 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక రాజకీయనాయకుడిలా పంచె కట్టు.. తెల్ల లాల్చీ, పైజామా అంటూ లుక్ మార్చేశాడు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఫిజిక్ మీద దృష్టి పెట్టకపోయినా లుక్ మాత్రం మార్చేశాడు. లాయర్ గా పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక క్రిష్ సినిమా కోసం లుక్ మారుస్తాడు అనుకున్న టైం లో కరోనా రావడం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో గెడ్డం, జుట్టు పెంచేసి ఓ బాబా లా తయారయ్యాడు. సాధువు అన్ని వదిలేసి ధ్యానంలో ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయి లుక్ ని వదిలేసాడు.

ఇక తాజాగా వకీల్ సాబ్ కోసం క్లీన్ షేవ్, హెయిర్ మంచిగా కట్ చేయించుకుని ఫార్మల్ లో లోకి మారిన పవన్ ని చూస్తుంటే పవన్ ఏదైనా నీకు సాధ్యం అంటూ పవన్ ఫాన్స్ మురిసిపోతున్నారు. ఇక పవన్ వకీల్ సాబ్ సెట్స్ లోకి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ తో ఫొటోస్ దిగే అభిమానుల లిస్ట్ చాంతాడంత రెడీ అయ్యింది. యాంకర్ శ్రీముఖి దగ్గరనుండి డాన్స్ మాస్టర్ జానీ వరకు పవన్ కళ్యాణ్ తో ఫొటోస్ తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. మరి పవన్ అలా లాయర్ లుక్ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఫిజిక్ పరంగా కాస్త లావుగా ఉన్న పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ లాయర్ గా బాగానే కనబడుతున్నాడు. ఇక మధ్య మధ్యలో అంటే వకీల్ సాబ్ సెట్స్ లో మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విషయాలను చూస్తూ బిజీగా గడిపేశాడు.

Tags:    

Similar News