ఏంటో ధైర్యం : డబ్బింగ్ సినిమాతో సంక్రాంతి బరిలోకి

Update: 2016-11-27 18:08 GMT

నడిగర్ సంఘం ఎన్నికలు, ఆపై నడిఘర్ సంఘం సభ్యుల ఏర్పాటు, ఇప్పుడు నిర్మాతల మండలి ఎన్నికలపై కన్ను, శరత్ కుమార్ తనయురాలితో సాన్నిహిత్యం ఇలా తమిళ హీరో విశాల్ కు ప్రతి కదలిక వివాదాస్పదం అవుతుంది. తమిళంతో సమానంగా తెలుగులోనూ అతగాడి సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ తమిళం లో సాధిస్తున్న విజయాలు తెలుగులో దక్కడంలేదు ఈ మధ్యన విశాల్కు. ఈ ఏడాది కూడా కథాకళి తమిళంలో విజయం సాధించగా తెలుగులో పరాభావం చెందింది. ఇప్పుడు విశాల్ తమన్నాలు జంటగా నటించిన కత్తి సాందాయ్ కూడా తెలుగు లోకి అనువాదమవుతుంది.

నిజానికి కత్తి సాందయ్ చిత్రం చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు గత నెలలోనే పూర్తి అయిపోయాయి. కానీ విశాల్ తెలుగు తమిళంలో ఒకే సారి సంక్రాంతికి ఆవటానికి ప్రణాళిక రచించుకున్నాడు. అసలే విశాల్ కి తెలుగులో సినిమాలు ఆడని తరుణంలో నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం, మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం విడుదలల మధ్యన ఈ అనువాద చిత్రం ఎలా నెట్టుకొస్తుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తమన్నా గ్లామర్ విడుదలకు సరిపోయే థియేటర్లను, ఆపై రెండు ప్రతిష్టాత్మక చిత్రాలను దాటుకుని ప్రేక్షకులను తమ చిత్రం వైపు మొగ్గు చూపే అంతగా ఆకట్టుకోలేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఐనా పోటీలో నిలబడితే విశాల్ తెలుగు ప్రేక్షకులకు మరింత దూరం అయ్యే ప్రమాదం కూడా వుంది.

Similar News