ఏంటి సమంత విషయం!!

సమంత తెలుగులో సినిమాలు ఒప్పుకోకుండా దర్శకనిర్మాతలకు దొరక్కుండా తప్పించుకుంటుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఇంట్లోనే లాక్ డౌన్ తో భర్త తో కలిసి [more]

Update: 2020-06-23 04:41 GMT

సమంత తెలుగులో సినిమాలు ఒప్పుకోకుండా దర్శకనిర్మాతలకు దొరక్కుండా తప్పించుకుంటుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఇంట్లోనే లాక్ డౌన్ తో భర్త తో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమంత ని ఫోన్ లో కలవడానిక్కూడా దొరకడం లేదంటున్నారు. ఇక తమిళనాట విగ్నేష్ శివన్ సినిమా నుండి బయటికొచ్చేసిన సమంత తమిళనాట మరే సినిమా ఒప్పుకోలేదు. ఇక బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీక్వెల్ లో నెగెటివ్ రోల్ లో నటిస్తున్న సమంత ని… ఈ వెబ్ సీరీస్ తర్వాత ఏంటి అంటే అందరూ ఏమో సమంత కె తెలియాలి అన్నారు.

అయితే తాజాగా సమంత పాన్ ఇండియా ఫిలిం కోసమే తెలుగు, తమిళం ను పక్కనబెట్టింది అని.. త్వరలోనే సమంత ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతుంది అని అంటున్నారు. సౌత్ లో సమంత క్రేజ్ అడ్డం పెట్టుకుని.. ఫ్యామిలీ మ్యాన్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరకాబోతున్న సమంత తో బాలీవుడ్ నిర్మాణ సంస్థ సోని పిక్చర్ ఓ పాన్ ఇండియా మూవీ చెయ్యబోతుందట. ఇందులో లేడీ ఓరియెంటెడ్ పాత్రను సమంత పోషించనుంది అని.. సౌత్, బాలీవుడ్ లలో భారీ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని సోని పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారని. అందుకే సమంత తెలుగు, తమిళ సినిమాలు ఒప్పుకోకుండా అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంది అంటున్నారు.

Tags:    

Similar News