ఎవరికైనా గట్టి పోటీ ఇవ్వగలనంటున్నాడు!!

Update: 2017-01-17 17:49 GMT

ఈ సంక్రాంతికి కోడిపందేలు ఏ రేంజ్ లో అయితే జరిగాయో అంతకన్నా హోరా హోరీగా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బడా హీరోల చిత్రాలుతో పాటు ఒక కుర్ర హీరో కుటుంబకథా చిత్రం పోటీ పడ్డాయి. ఇక పెద్ద హీరోలు, సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మధ్యన పోరు ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించగా వీరి మధ్యన కూల్ గా కుటుంభం కథా చిత్రంతో శర్వానంద్ పండగ హీరో అనిపించుకున్నాడు. ఇక సంక్రాంతి పండగకకి విడుదలైన ఈ మూడు చిత్రాలు మూడు డిఫ్రెంట్ కథలతో తెరకెక్కి విజయాన్ని సాధించాయి. ముందుగా చిరు 'ఖైదీ నెంబర్ 150 ' జనవరి 11 న విడుదలై మెగా అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులని అలరించింది. ఇక బాలయ్య చారిత్రాత్మక కథని మూల కథగా తీసుకుని 'గౌతమీపుత్ర శాతకర్ణి'గా జనవరి 12 న విడుదలై నందమూరి అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్నాడు. ఇక పండగ రోజు జనవరి 14 న శర్వానంద్ ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలించడానికి 'శతమానంభవతి' అంటూ ఈ పండక్కి నేనే ఫ్యామిలీ హీరో అంటూ వచ్చి హిట్ కొట్టేసాడు.

ఇప్పటికే శర్వానంద్ పోయిన సంక్రాతి కి 'ఎక్సప్రెస్స్ రాజా'తో హిట్ కొట్టి సంక్రాతి హీరో అనిపించుకున్న శర్వా ఇప్పుడు కూడా 'శతమానంభావతి'తో మరోసారి సంక్రాతి కి హిట్ హీరో అనిపించుకున్నాడు. ఇద్దరు పెద్ద హీరోల మధ్యన ధైర్యంగా తన సినిమా విడుదల చేసి ఎవరికైనా గట్టిపోటీ ఇవ్వగలనని శర్వా రెండోసారి నిరూపించాడు. ఒక గ్రామంలో సంక్రాంతిని ఎలా జరుపుకుంటారో ఆ పండక్కి ఇంట్లో వారంతా ఒకేచోట కలిస్తే ఆ ఆనందమే వేరు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'శతమానంభవతి' ఒక మంచి కుటుంభం కథా చిత్రంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Similar News