ఎన్నికల తర్వాత పవన్ సినిమాలు

Update: 2018-03-25 06:11 GMT

పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇకపై సినిమాల్లో నటిస్తాడా లేదా అన్నదానిపై అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు పవన్. పవన్ తనకు నటనపై అంతగా ఆసక్తి లేదని అయితే చెబుతూనే వున్నాడు. కానీ పవన్ కు ఇన్‌కమ్‌ సోర్స్‌ సినిమాలు కావడం విశేషం. మరి అవి మానేస్తే ఎలా నెట్టుకొస్తాడనేది టాపిక్‌గా మారింది.

సినిమాల్లో నటిస్తాడో లేదో కానీ..నిర్మాతగా వచ్చే ఏడాది నుండి ఫుల్ బిజీ అవ్వనున్నాడట. ప్రస్తుతం నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ' సినిమాను నిర్మిస్తున్నాడు. కేవలం చిన్న సినిమాలే కాకుండా భారీ చిత్రాలకి కూడా పవన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడట.

చరణ్ తో తన బ్యానర్ లో ఓ సినిమా తీయాలనుకున్నాడు పవన్ అయితే ఆ ప్రపోజల్‌ అలాగే వుంది. చరణ్ కూడా బాబాయ్ ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అని చాలా సార్లు చెప్పాడు. కనుక పవన్ యాక్ట్ చేస్తాడా లేదా అనే దానిపై సందేహాలు ఇంకా అలాగే వున్నా కానీ 'పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌' అయితే యాక్టివ్‌ కానుంది. ఎలక్షన్స్ తర్వాత పవన్ తన బ్యానర్ లో పూర్తిగా సినిమాలు నిర్మిస్తాడంట.

Similar News