ఎన్టీఆర్ వరుసగా అదరగొట్టేస్తున్నాడు

Update: 2017-08-17 09:00 GMT

'జై లవ కుశ' సినిమా మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఎన్టీఆర్... ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడే అదిరిపోయే ట్రీట్స్ ఇస్తున్నాడు. సినిమా మొదలైన కొద్ది రోజులకే 'జై లవ కుశ' టైటిల్ మోషన్ పోస్టర్ తో దిగిపోయిన 'జై లవ కుశ' వెనువెంటనే ఎన్టీఆర్ బర్త్ డే కి 'జై' ఫస్ట్ లుక్ తో రచ్చచేసాడు. అలాగే 'జై' టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ మొన్న రక్షబందన్ కానుకగా 'లవ' లుక్ తో ఇంప్రెస్స్ చేసాడు. కాస్త 'లవ కుమార్' లుక్ మరీ సాఫ్ట్ గా ఉందంటూ కామెంట్స్ పడ్డయిగాని 'లవ' టీజర్ కోసం మాత్రం ఎదురు చూపు ఎక్కువైంది.

ఒక్కో టీజర్ ని జాగ్రత్తగా వదులుతున్న ఎన్టీఆర్ అండ్ బ్యాచ్ ఇప్పుడు ఈ వినాయకచవితి పండుగ సందర్భంగా 'లవ' టీజర్ తో దున్నేస్తారట. 'జై లవ కుశ' లోని మూడు పాత్రలకు మూడు టీజర్స్ ని తయారు చేసి ఎన్టీఆర్ అభిమానులకు పండగ తీసుకొస్తున్న డైరెక్టర్ బాబీ ఇప్పుడు రాబోయే 'లవ' టీజర్ ని ఎలా చూపించబోతున్నాడో అనే సస్పెన్స్ లో ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 'కుశ' పాత్రకి సంబందించిన లుక్ గాని టీజర్ గాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశలో ఎన్టీఆర్ ఫాన్స్ కొట్టుకుపోతున్నారు

ఇక 'కుశ' కి సంబందించిన లుక్ ని డైరెక్టర్ బాబీ, నిర్మాత కళ్యాణ్ రామ్ లు ఈ నెలాఖరులో విడుదల చేయబోతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. నిజంగా ఇదే గనక నిజమైతే ఒక్క నెలలోనే మూడు సర్ప్రైజ్ లు అందుకున్న ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. ఇక సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్న 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తున్నారు.

Similar News