ఎన్టీఆర్ ని తయారు చేసినట్టే చరణ్ ని కూడా..!

Update: 2017-01-08 17:19 GMT

డైరెక్టర్ సుకుమార్ తన చిత్రంలో నటించే హీరోలను చాలా క్లాస్ లుక్ తో చూపిస్తుంటారు. '1 నేనొక్కడినే' లో మహేష్ ని స్టైలిష్ గా చూపించిన సుకుమార్ టెంపర్ తో రఫ్ గా తయారయిన ఎన్టీఆర్ లుక్ ని 'నాన్నకు ప్రేమతో' సినిమా కోసం పూర్తిగా మార్చేశాడు. ఇక ఆ చిత్రంలో ఎన్టీఆర్ గెడ్డం బాగా పెంచి మంచి హెయిర్ స్టైల్ తో కనిపిస్తాడు. విలన్ మీద పగ తీర్చుకోవడం కూడా చాలా స్టయిల్ గా చెయ్యొచ్చని సుకుమార్, ఎన్టీఆర్ ని 'నాన్నకు ప్రేమతో' లో చూపించాడు.

ఇక ఇప్పడు రామ్ చరణ్ వంతు వచ్చింది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం కోసం రామ్ చరణ్ స్టైల్ ని డిఫరెంట్ గా మార్చేశాడు సుకుమార్. పెంచిన గెడ్డం.... స్టైలిష్ క్రాఫ్ తో రామ్ చరణ్ 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ లో చరణ్ సూపర్ గా కనిపిస్తున్నాడని మెగా ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ 'ధ్రువ' చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచాడు. సినిమా మొత్తం సిక్స్ ప్యాక్ లోనే కనిపించిన చరణ్ అప్పట్లో చాలా కష్టపడి..... ఎక్కువ టైమ్ జిమ్ లోనే గడిపేసి సక్సెస్ సాధించిమళ్ళీ ఇప్పుడు సుకుమార్ తీయబోయే లవ్ స్టోరీ కోసం తన టోటల్ లుక్ ని మార్చేసాడని అంటున్నారు. 'ఖైదీ నెంబర్ 150 ' కి సంబందించిన విడుదల కార్యక్రమం అవ్వగానే చరణ్, సుకుమార్ తో సినిమా ప్రారంభించేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమా తొందరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ మీదకెళుతుందని సమాచారం.

Similar News