ఎన్టీఆర్ ని కామెడీ యాంగిల్ కే సెట్ చేస్తున్నాడా?

Update: 2017-12-11 17:00 GMT

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తో బిజీ గా ఉన్నాడు. అజ్ఞాతవాసి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సంక్రాంతి సందర్బంగా జనవరి 10 'అజ్ఞాతవాసి' గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పబ్లిసిటి కార్యక్రమాల్లోనూ జోరు చూపిస్తున్న ఈ సినిమా పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు.

ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి...

నవంబర్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకెళ్లబోతుంది. అయితే ప్రస్తుతం కొద్దిగా లావు ఉన్న ఎన్టీఆర్.... త్రివిక్రమ్ మూవీ కోసం లావు తగ్గే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడనే టాక్ వినబడుతుంది. 'బృందావనం' తరహ లుక్ కావాలని ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ చెప్పాడట. ఈమధ్య గడ్డంతో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఈసారి మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం క్లీన్ షేవ్ తో యంగ్ లుక్ లో కనిపిస్తాడట.

కామెడీ ప్రధానంగా....

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా 'నువ్వు నాకు నచ్చావ్' తరహాలో కామెడీ ప్రధానంగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ ని కలిసినప్పుడు తనకి 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమానే కావాలని ఎన్టీఆర్ చెప్పడం వల్లే త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేశాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా మూడు ఫైట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

Similar News