ఎన్టీఆర్ కి థాంక్సా.. నో...నో..

Update: 2017-10-25 03:30 GMT

బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న బాలయ్య 102 వ చిత్రానికి టైటిల్ 'కర్ణ' గా ఫిక్స్ చేసినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. అయితే 'కర్ణ' అనే టైటిల్ బాలయ్య కి నప్పదని... ఆ టైటిల్ అంత పవర్ ఫుల్ గా లేదని నందమూరి అభిమానులు వేడుకొనగా... వెనక్కి తగ్గిన చిత్ర బృందం ఇప్పుడు కొత్తగా 'జై సింహ' అనే టైటిల్ ని తీసుకుంటున్నారనే ప్రచారం గత రెండు రోజులుగా ఊపందుకుంది. 'జై సింహ' కె బాలకృష్ణ కూడా ఓటేసాడని.. 'సింహ' అనే టైటిల్ తనకి అచ్చి రావడంతో పాటే.. 'జై లవ కుశ' సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ 'జై సింహ' కి ఓటసాడనే ప్రచారము ఉంది. 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ 'జై' నటనకు ప్రేక్షకులతోపాటే సినిమా ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరు నీరాజనాలు పట్టారు. ఆ 'జై లవ కుశ'లో 'జై' పేరుతొ పాటు ఆ పాత్రకున్న పవర్ నచ్చి బాలయ్య సినిమాకి 'జై సింహ' అనే టైటిల్ పెట్టుకున్నారని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు.

అలాగే 'జై' పాత్రలాంటి ఒక పవర్ ఫుల్ కేరెక్టర్ ని బాలయ్య కూడా చేయాలనుకోవడం... 'జై' కేరెక్టర్ కి బాలయ్య కనెక్ట్ రావడంతోనే తన సినిమాకి 'జై' కలిసొచ్చేలా 'జై సింహ' టైటిల్ ని ఎంపిక చేశారంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరి ఈవిషయమై బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పాలని బాలయ్య అభిమానులు కోరుతున్నారట. మరి నిజంగానే బాలయ్య అభిమానులు కోరినట్టు ఎన్టీఆర్ కి థాంక్స్ చెబుతాడా అంటే మాత్రం డౌట్. ఎందుకంటే బాలయ్యకి ఎన్టీఆర్ అంటే అస్సలు పడదు.

అలంటి టైం లో అభిమానులు కోరితే మాత్రం ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పేస్తాడా? ఏదో అభిమానుల పిచ్చిగాని బాలయ్య.. ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పడమేమిటండి విడ్డురం కాకపోతేనూ. బాలకృష్ణ ఎన్టీఆర్ ని ఎలా చూస్తాడో అనే విషయం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ పొడ అంటేనే గిట్టని బాలకృష్ణ ఏదో జై టైటిల్ పెట్టుకున్నందుకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పడమా.. నో నో అలాంటిదేం ఉండదు అంటున్నారు కొందరు

Similar News