ఎట్టకేలకు దిగొచ్చాడు!!

Update: 2017-04-21 10:16 GMT

బాహుబలిని కట్టప్ప ఎందుకు ఛంపాడో తెలుసుకోవాలని 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం విడుదల కోసం ప్రేక్షకలోకం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుండగా బాహుబలి కి ఒక సమస్య వచ్చిపడింది. అదికూడా కట్టప్ప వల్ల. బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ వల్ల కన్నడలో బాహుబలి చిత్రం విడుదల కష్టాలు ఎదుర్కొంటుంది. కావేరి జలాల సమస్యపై తమిళులకు అనుకూలంగా కన్నడీగులకు వ్యతిరేఖంగా సత్యరాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాహబలి మెడకు చుట్టుకున్నాయి. సత్యరాజ్ నటించిన బాహుబలి ని ఎట్టి పరిస్థితుల్లో కన్నడలో విడుదల

కానివ్వబోమని వారు కంకణం కట్టుకుని కూర్చున్నారు.

సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే బాహుబలి విడుదల ఆపేస్తామని... భారీ బంద్ నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇక రాజమౌళి సత్యరాజ్ కి బాహుబలి నిర్మాణానికి ఎటువంటి సంబంధం లేదని.... ఆయన కేవలం ఒక నటుడని... ఆయన వల్ల సినిమా విడుదల ఆగిపోతే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయని కన్నడ ప్రజలను వేడుకున్నా వారు వెనక్కి తగ్గలేదు. ఇక చేసేది లేక సత్యరాజ్ ఒక మెట్టు దిగి కన్నడ ప్రజలకు మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పి..... తానూ జీవితం లో తమిళ ప్రజల కోసం పోరాడుతానని... నేను కన్నడీగులకు వ్యతిరేకిని కాదని... నా వ్యాఖ్యల కారణంగా బాధపడిన వారందరికీ పేరు పేరునా క్షమాణాలు చెబుతున్నా అని చెప్పాడు.

అసలు నేను బాహుబలిలో చిన్న పాత్ర చేశానని నా ఒక్కడి గురించి ఇలా అంత పెద్ద భారీ ప్రాజెక్ట్ విడుదల అడ్డుకోవడం సబబు కాదని ... ఈ విషయాన్ని అటు కన్నడీగులు ఇటు తమిళులు అర్ధం చేసుకుంటారని చెప్పాడు. మరి కట్టప్ప మాట్లాడింది విని కన్నడీగులు శాంతిస్తారేమో గాని తమిళులు ఎలా స్పందిస్తారో చూద్దాం.

Similar News