ఎందుకిలా చేశారు

Update: 2017-08-22 12:31 GMT

మెగాఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెగా స్టార్ చిరు 151 వ చిత్రం టైటిల్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అంగరంగవైభవంగా జరిగింది. 151 వ చిత్రం టైటిల్ 'సై రా నరసింహారెడ్డి'గా పెట్టిన చిత్ర టీమ్ నటీనటులపేర్లను కూడా మోషన్ పోస్టర్ రూపంలో విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ ని దర్శకధీరుడు రాజమౌళి చేతులమీదముగా లాంచ్ చేయించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ లు. అయితే మెగాస్టార్ బర్త్ డే రోజున చిరు మాత్రం ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనకుండా అభిమానులను నిరాశపరిచారు.

అయితే ఇప్పుడు ఈచిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్నది కాబట్టి ఈ చిత్రానికి ఉయ్యాలవాడ గాని మహావీర్ టైటిల్ గాని పెడతారని ఫాన్స్ దగ్గరనుండి ఉయ్యాలవాడ వారసుల వరకు ఎక్సపెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా చిరు 151 వ చిత్రానికి 'సై రా నరసింహారెడ్డి' గా పెట్టి అందరిని నిరాశపరిచారనే టాక్ మొదలైంది. అలాగే ఉయ్యాలవాడ వారసులు కూడా ఈ చిత్రానికి ఉయ్యాలవాడ టైటిలే పెడతారనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చిత్రానికి 'సై రా నరసింహారెడ్డి' అని పెట్టేసరికి వారు పూర్తిగా డిస్పాయింట్ అవడమే కాదు సినిమా టైటిల్ మార్చడంపై ఉయ్యాలవాడ వారుసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి సినిమాని మొదలుపెట్టే ముందు ఉయ్యాలవాడ వారసుల దగ్గరకు వెళ్లి మరీ వారి అభిప్రాయాలను తెలుసుకున్న చిత్ర టీమ్ ఇప్పుడు టైటిల్ విషయంలో ఇలా ఎందుకు చేసిందో అనే దానిమీద ఉయ్యాలవాడ వారసులు మండిపడుతున్నారట. జాతీయ స్థాయిలో క్రేజ్ కొట్టెయ్యడానికి అన్ని భాషల నటులను తీసుకున్న చిత్ర యూనిట్ ఈపేరు మార్పు గురించి ఏం చెప్పబోతుందో అంటూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇండియాలోని సినీప్రేమికులంతా ఎదురు చూస్తున్నారు. మరి డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్, హీరో చిరంజీవిలు ల స్పందన కూడా ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది అందరిలో.

Similar News