ఎంతో సమయం లేదు...!!

Update: 2017-07-16 08:35 GMT

ఇప్పడు అందరి చూపు తెలుగు బుల్లితెరమీద రాబోతున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ మీదే. ఈ రోజు ఆదివారం రాత్రి 9 గంటలకు ఎంతో ఆర్భాటంగా ఆరంభం అయ్యే ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అంత ఉత్కంఠ ఎందుకంటే మొదటిసారి వెండితెర మీద నుండి బుల్లితెర మీద కి వస్తున్న ఎన్టీఆర్ ఈ షో ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అలాగే ఎన్టీఆర్ ఈ షో లో ఏమేం చెయ్యబోతున్నాడు, సినిమాలో డాన్స్ స్టెప్స్ లాగా ఎలాంటి డాన్స్ తో ఆకట్టుకుంటాడు. ఎన్టీఆర్ వాయిస్ పవర్ ఎలా ఉండబోతుంది, అసలు ముఖ్యంగా ఈ షోలో పార్టిసిపేట్స్ ఎవరు, ఇందులో ఎవరు పాల్గొనబోతున్నారో ముందుగా చెప్పకుండా సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు కాబట్టి... వారెంత సెలబ్రిటీస్ అయ్యుంటారు అనేదాని మీద వీడని ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మరి బాలీవుడ్ లో బిగ్ బాస్ షో వచ్చాక బుల్లితెర మీద వచ్చే రియాలిటీ షోస్ అన్నిటీకి బిగ్ బాస్ షో మొగుడై కూర్చుంది. కారణం హోస్ట్ సల్మాన్ కావడం, మరోవైపు పార్టిసిపేట్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారడం, ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఉండడం, అలాగే బిగ్ బాస్ హౌస్ కూడా అందులో కీలకపాత్ర పోషించడం. మరి ఇన్ని హంగులతో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షో రెడీ అయిందంటారా? ఏమో మరి ఏది తెలియాలన్నా ఖచ్చితం గా ఈ రోజు రాత్రి 9 గంటల వరకు ఆగాల్సిందే.

ఇక ఈ షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ అదరగొడతాడని.... వెండితెర మీద వెలిగిపోతున్నట్టే ఇక్కడ బుల్లితెర మీద కూడా సత్తా చాటుతాడని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. వెండితెర మీద హిట్ అయిన ఎన్టీఆర్ భవిష్యత్తు ఇప్పుడు బుల్లితెర మీద ఎలా వుండబోతుందో మరి కొద్దీ గంటల్లో తేలిపోతుంది.

Similar News