ఉంటారా... వెళ్తారా...!!

Update: 2017-01-25 08:25 GMT

తెలుగులో మంచి పొజిషన్ లో కొనసాగుతూనే అటు తమిళంలో కూడా మంచి పొజిషన్ మెయింటింగ్ చేస్తున్నారు దక్షిణాది హీరోయిన్స్. తెలుగు, తమిళంలో రెండు చోట్లా హవా కొనసాగిస్తున్న కాజల్, తమన్నాలకు ఇప్పుడు తమిళుల పరంగా పెద్ద చిక్కొచ్చిపడిందట. వారి తమిళ కెరీర్ ప్రమాదంలో పడిందనే వార్తలు వినబడుతున్నాయి. కాజల్, తమన్నాలని తమిళ సినిమా రంగం నుండి బహిష్కరించాలని నడిగర్ సంఘాన్ని కొంతమంది ఒత్తిడి చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి నడిగరసంఘ సభ్యులు బలమైన కారణాన్ని వినిపిస్తున్నారు.

కారణం ఏమిటంటే పెటా అనే సంస్థ తమిళనాడులో జల్లికట్టు ను నిషేదించాలని చెప్పింది. జల్లికట్టుని నిషేదించాలని నినదించిన పెటాను.... దానికి అనుబంధం గా వున్నవారిని కూడా తమిళులు వ్యతిరేకిస్తున్నారు. ఇక పెటా పై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెటాకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా కొనసాగుతున్న తమిళ సినీ ప్రముఖులంతా ఇప్పుడు ఆ సంస్థ నుంచి బయటకి వచ్చి జల్లికట్టు ఉద్యమాన్ని సమర్థిస్తున్నారు . కానీ కాజల్, తమన్నా లు మాత్రం ఇంకా పెటాకు అనుబంధంగానే కొనసాగుతుండడంతో వీరిపై తమిళనాట తమిళ సినీపరిశ్రమ నుండి వారిని బ్యాన్ చెయ్యాలనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జల్లికట్టు నిషేధంపై సినీ తారలంతా కలిసి కట్టుగా రోడ్ పైకి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నా కూడా కాజల్, తమన్నాలు వారితో కలవకుండా సైలెంట్ గా ఉండిపోవడంతో వారిపై తమిళ తంబీలు గుర్రుగా వున్నారు.

ఇక నడిగర్ సంగంలో సభ్యత్వం వున్న కాజల్, తమన్నాలపై వేటు వెయ్యాలని కొంతమంది నడిగర్ సంఘ సభ్యులు నడిగర్ సంగంపై ఒత్తిడి తెస్తున్నారట. ఇక వీరిద్దరికి నడిగర్ సంఘం నోటీసులు జారీ చెయ్యాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరి నోటీసులు చేరక ముందే వీరు పెటా నుండి వైదొలిగితే బావుంటుంది. లేకపోతె తమిళ సినిమా పరిశ్రమను వీరు శాశ్వతంగా కోల్పోవలసి వస్తుందనే వాదన ఇప్పుడు అక్కడ బలంగా వినబడుతుంది.

Similar News