ఈసారి మధ్యతరగతి అమ్మాయిలా..?

Update: 2018-03-15 08:33 GMT

ఇంతవయసొచ్చినా గ్లామర్ షోకి అస్సలు వెనుకాడదు నయనతార. బికినీ వేయాలన్న వేసేస్తుంది. ఆందుకే స్టార్ హీరోల పక్కన, యంగ్ హీరోల పక్కన కూడా నయనతార సరిగ్గా సెట్ అవుతుంది కూడా. అలా ఉండబట్టేనేమో నయనతార ఇప్పటకీ టాప్ పొజిషన్ లోనే కొనసాగుతుంది. అంతేకాదు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది. ఒక పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క లేడి ఒరింటెడ్ చిత్రాల్లో చీర కట్టులో తనదైన స్టయిల్లో సింప్లి సూపర్బ్ గా కనబడుతుంది. గ్లామర్ షో గ్లామర్ షోనే... అలాగే నటనకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఇలా నయనతార డైరీ ఎప్పుడూ బిజినే.

ఈమధ్యనే తమిళంలో 'ఆరం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయనతార ఇప్పుడు అదే సినిమాని తెలుగులో కర్తవ్యం పేరుతో వస్తుంది. ఈ చిత్రం రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కలెక్టర్ గా నయనతార నటనకు తమిళనాట బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమాలో నయనతార లెనిన్ సారీస్ లో సింపుల్ గా గ్లామర్ షోకి దూరంగా వుంది. ఇక ఈ సినిమా తర్వాత నయనతార తమిళంలో లైకా ప్రొడక్షన్ వారి నిర్మాణంలో.. నెల్సన్ దర్శకత్వంలో 'కో కో' సినిమాలో నటిస్తుంది. అయితే ఈ 'కో కో' సినిమాలో నయనతార ఒక మధ్యతరగతి అమ్మాయిలా కనబడబోతుంది. మరి మధ్యతరగతి అమ్మాయి అంటే అటు పేదకి ఇటు ఉన్నతమైన కుటుంబానికి మధ్యలో ఉండే అమ్మాయిలా నయనతార నటన ఎలా వుండబోతుందో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో బయలు దేరింది.

ఇక మధ్యతరగతి అమ్మాయి పడే కష్టాలు, ఆ కష్టాలను ఆ అమ్మాయి సమర్ధవంతంగా ఎలా ఎదుర్కొంది. అనే అంశాలతో 'కో కో' సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. అయితే నయనతారకు తెలుగులో ఉన్న డిమాండ్ ని బట్టి ఈ సినిమాని అటు తమిళం, ఇటు తెలుగులోనూ ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Similar News