ఈసారి అభిమన్యుడంట!!

Update: 2017-11-15 12:00 GMT

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు డిటెక్టివ్ సినిమా తో వచ్చి తెలుగులో డీసెంట్ హిట్ అందుకున్నాడు హీరో విశాల్. ఎప్పుడూ తన సినిమాలను తమిళంతోపాటే తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తుంటాడు విశాల్. ఇకపోతే డిటెక్టివ్ సినిమాకు కలెక్షన్లు రాకపోయినా చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బావుందని కితాబునిచ్చేస్తున్నారు. ఇక డిటెక్టివ్ సినిమా టైం లోనే విశాల్.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఇరింబు తెరై అనే సినిమా మొదలు పెట్టేసాడు. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతికి దింపాలని భావిస్తున్నాడు.

అభిమన్యుడి పేరుతో....

అయితే విశాల్ తాజాగా తమిళంలో ఇరింబు తెరై టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకి తెలుగు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. తెలుగులో అభిమన్యుడు పేరుతో రాబోతోంది ఇరుంబు తెరై సినిమా. ఈ సినిమాలో విశాల్ కి జోడిగా అక్కినేనివారి కోడలు సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక తెలుగులో ఈ సినిమాని సంక్రాంతికి విడుదల సాధ్యంకాకపోయినా కనీసం కోలీవుడ్ లో అయినా పొంగల్ టైమ్ కు వద్దామని చూస్తున్నాడు.

తానే నిర్మాత...

ఇక ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు విశాల్. అయితే అభిమన్యుడు సినిమాలో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు

Similar News