ఈ హీరో నోటి వెంట నిజాలు కూడా అబద్దాలే అనిపిస్తున్నాయే...!

Update: 2018-01-27 09:00 GMT

యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా చిత్రం చలో ని విస్తృతంగా ప్రమోట్ చేసుకునే పనిలో బిజీ గా వున్నాడు. ఈ క్రమంలో సినిమా క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళటానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి ని ముఖ్య అతిధిగా ఆహ్వానించి తన ప్రొమోషన్స్ కి జోష్ తీసుకొచ్చాడు నాగ శౌర్య.

చిరును పొగిడేందుకే...

ఈ వేడుక లో వేదికపై మాట్లాడిన నాగ శౌర్య తన చిత్రం చలో గురించి కంటే మెగా స్టార్ చిరంజీవి చరిష్మా ని పొగడటానికే అధిక సమయం కేటాయించాడు. గౌరవ ముఖ్య అతిధి, పైగా అన్ని రకాల పొగడ్తలకి అన్ని విధాలుగా అర్హులైన చిరంజీవి ని పొగడటం పెద్ద వింత ఏమి కాదు కానీ ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ లో అభిమాన నటుడి గురించి అడిగినా నాగ శౌర్య తడబడకుండా చెప్పిన పేరు తారక్. కానీ చలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై చిరంజీవి గురించి పొగుడ్తూ శౌర్య, మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా మెగా స్టార్ చిరంజీవి అభిమాని గానే పుట్టాలి అని కోరుకుంటున్నా అని అక్కడ వున్న మెగా స్టార్ అభిమానులని ఉత్తేజపరిచారు. మెగా స్టార్ నెం.1 హీరో అని, టాప్ చైర్ ఆయనదే అని చెప్పటం వరకు సమంజసం గానే అనిపించినా ఇంత కాలం అభిమాన హీరో అని ఒకరి పేరు చెప్పి ఇప్పుడు తన వేడుక కి అతిధిగా విచ్చేసిన కారణం చేత అభిమాన హీరో ని మార్చేసుకోవటం మాత్రం చాలా ఎబెట్టుగా అనిపించక మానదు కదా!!

Similar News