ఈ సినిమాతో అమ్మడు బిజీ అవుతుందేమో

Update: 2016-12-17 13:54 GMT

ఇటీవలి కాలంలో పవర్, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యోఅచ్చుతానంద వంటి పలు చెప్పుకోదగ్గ విజయాలు ఖాతాలో వేసుకున్నప్పటికీ కథానాయిక రెజినా కాసాండ్రా కి అటు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్లో కానీ, ఇటు మాస్ ప్రేక్షకుల్లో కానీ ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. మరో వైపు పెద్ద కథానాయకుల సరసన నటించే అవకాశాలు కూడా రెజినా తలుపు తట్టటం లేదు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దృష్టిని ఆకర్షించగలిగింది. అన్ని కలిసొస్తే ఇదే రెజినా బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ కావొచ్చు కూడా. నిన్నే పెళ్లాడతా తో టబు, మురారి-ఖడ్గం లతో సోనాలి బింద్రే, చందమామ తో కాజల్ అగర్వాల్ లకు స్టార్ హీరోయిన్స్ హోదా కలిపించటమే కాక అప్పటికే స్టార్ హోదా వున్నా అద్భుత నటి సౌందర్య కు అంతఃపురం చిత్రంతో ప్రేక్షకుల మనస్సుల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరిచి పెట్టాడు.

ప్రస్తుతం కృష్ణ వంశి తనని తాను పరిశ్రమలో రీ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి తపనతో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం నక్షత్రం లో రెజినా కాసాండ్రా కు ముఖ్య భూమిక దొరకటం రెజినా అదృష్టం గానే కనిపిస్తుంది. ఒక్క స్టార్ హీరో సినిమాలో కూడా మెరవకుండానే స్టార్ హీరోయిన్ అయిపోయే అవకాశం నక్షత్రం ద్వారా కృష్ణ వంశి ప్రసాదించాడనే అంటున్నారు టీజర్ చూసిన వారంతా. రెజినా లుక్స్ కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఇక నటన విషయానికి వస్తే ఏ పాత్రకు తగట్టు నటీనటుల నుంచి ఎంత మోతాదులో హావభావాలు పలికించాలో కృష్ణ వంశి కన్నా బాగా మరెవరికి తెలుసు? కాబట్టి నక్షత్రం విడుదల తరువాత రెజినా అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయే అవకాశాలే మెండుగా వున్నాయి.

Similar News