ఈ మూడు రోజుల గోలేమిటండి!!

Update: 2017-07-08 03:44 GMT

నాగ చైతన్య - సమంత వచ్చే అక్టోబర్ 6 న పెళ్ళిచేసుకుని ఒక్కటి కాబోతున్నారు. అక్టోబర్ లో జరిగే ఈ పెళ్లి వేడుక గోవా లో జరగనుంది. హిందూ, క్రిస్టియ‌న్ స్టైల్‌లో తమ పెళ్లి జ‌రుగుతుంద‌ని నాగ చైతన్య ఇదివరకే చెప్పాడు. అయితే ఇప్పుడు నాగ చైతన్య - సమంతలు మూడు రోజులు పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ పెళ్లి వేడుక మూడ్రోజుల పాటు గోవా లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇంతకుముందెప్పుడూ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో జ‌ర‌గ‌నంత గ్రాండ్ గా ఈ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయనే టాక్ వినబడుతుంది.

అక్టోబ‌ర్ 6 నుంచి 8 వ‌ర‌కూ పెళ్లి వేడుక‌ను ఎంతో సంబ‌రంగా జ‌రిపించేందుకు అక్కినేని ఫ్యామిలీ స‌న్నాహాలు చేస్తోందిట‌. ఆ మేర‌కు ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు మొద‌లైపోయాయి. అలాగే అక్కినేని కుటుంబ సభ్యులతోపాటు నాగార్జున బిజినెస్ ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఇంకా నాగ చైతన్య ఫ్రెండ్స్, సమంత కుటుంబీకులు, సన్నిహితులు అలాగే తెలుగు, త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌ సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి భారీగా సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది.

ఇక ఈ పెళ్లి కోసమే నాగ చైతన్య, సమంత లు తమ తమ షూటింగ్ లకు ఈ సెప్టెంబర్ కల్లా సెలవు పెట్టేసి మూడు నెలలు లాంగ్ లీవ్ తీసుకోనున్నారు.

Similar News