ఈ భామకి తెలుగు హీరోలు అసలు నచ్చరు

Update: 2018-01-27 11:00 GMT

సామాన్యంగా చలన చిత్ర పరిశ్రమలో కథానాయికలు అంటే మీడియా ఫ్రెండ్లీ గా వుంటూ వుంటారు. నిత్యం మీడియా చానెల్స్ లో ఇంటర్వూస్ ద్వారా కనిపిస్తుంటే వారికి కూడా ప్రేక్షకులకి చేరువయ్యే దారి సులభమవుతుంటుంది. అయితే ఈ విషయంలో తన రూటే సెపరేట్ అని నిరూపిస్తూ మీడియా ప్రమేయం లేకుండానే స్వతహాగా స్టార్ ఇమేజ్ ని, అభిమానులని సంపాదించుకున్న కథానాయిక నయనతార. అయితే మీడియా కి బాగా అలవాటైన భామలు సైతం బదులివ్వటానికి భయపడే ప్రశ్నకి తాజాగా నయన్ ఇచ్చిన ఒక అరుదైన ఇంటర్వ్యూ లో తడపడకుండా సమాధానం ఇచ్చేసింది.

తెలుగులో ఎవరూ లేరా?

మీ అభిమాన హీరో ఎవరంటూ యాంకర్ వేసిన ప్రశ్న కి ఏ కథానాయికైనా తాను పని చేసే అన్ని భాషలలో స్టార్ హీరోస్ పేర్లన్నీ చెప్పేస్తుంది. నయన్ మాత్రం ఎలాంటి హిపోక్రసీ కి తావులేని విధంగా తన అభిమాన హీరోలు విజయ్, అజిత్ లు మాత్రమే అని కుండా బద్దలు కొట్టేసింది. దీనితో ఇన్ని విజయవంతమైన చిత్రాలు, అభిమాన ఘనం వున్న తెలుగు లో నయన్ అభిమానించే హీరోలు ఎవరు లేరనే విషయం స్పష్టం అయిపోయింది.

Similar News