ఈ నిర్మాతకి ఒకచోట పోయినా.. మరో చోట దక్కింది!!

Update: 2017-10-07 12:00 GMT

ఎన్నడూ లేనివిధంగా దసరాకి మొత్తం మూడు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ మూడు సినిమాల రిజల్ట్ అందరికి తెలిసిందే. జై లవ కుశ యావరేజ్ గాను... స్పైడర్ డిజాస్టర్ గాను.... మహానుభావుడు మాత్రం హిట్ గాను నిలిచాయి. ఎన్టీఆర్, మహేష్, శర్వానంద్ తమ బలాబలాలను ఈ దసరాకి గట్టిగానే చూపించారు. అయితే ఆ ముగ్గురు హీరోలేమో గాని ఇప్పుడు ఒక నిర్మాతకు ఈ మూడు సినిమాల వలన లాభంపొందింది ఎంత, నష్టపోయింది ఎంత.. అనేదానిమీద రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ మూడు సినిమాలకు ఒక్కడే నిర్మాత కాకపోయినప్పటికీ... ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్ గా ఈ మూడు సినిమాల నైజాం హక్కులను కొనుక్కున్నాడు.

జై...లో నష్టమేమీ లేదట....

అయితే అందులో మొదట సినిమా అయిన జై లవ కుశ దిల్ రాజుకి భారీ నష్టాలను రాకుండా చూసుకుంది. కానీ దసరాకి రెండో మూవీ గా రిలీజ్ అయిన స్పైడర్ మాత్రం దిల్ రాజు ని కోలుకోలేని దెబ్బ తీసిందని తెలుస్తోంది. అవును స్పైడర్ నైజాం హక్కులను భారీ మొత్తం పెట్టి దక్కించుకున్న దిల్ రాజు సినిమా రిలీజ్ తరువాత వచ్చిన డివైడ్ టాక్ వల్ల 13 కోట్ల వరకు నష్టపోయినట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియాల్లో ఎప్పుడూ విడుదల కాని విధంగా మహేష్ బాబు స్పైడర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా ఉండడంతో కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు అంతా. కానీ సినిమా అనుకున్నంతగా దిల్ రాజు భారీగా లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది.

మహానుభావుడు ఆదుకుంది.....

ఇక దసరాకి రిలీజ్ అయిన మూడో సినిమా మహానుభావుడు కూడా నైజాం లో రిలీజ్ చేశాడు దిల్ రాజు. అయితే ఆ సినిమా ని కొన్న దానికంటే కూడా ఎక్కువే కలెక్ట్ చేసి దిల్ రాజు ని ప్రాఫిట్స్ లోకి నెట్టేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో స్పైడర్ కి డివైడ్ టాక్ రావడంతో మహానుభావుడు కి థియేటర్స్ పెంచడంతో కలెక్షన్స్ కుమ్మేసింది. ఈలెక్కన శర్వానంద్ దిల్ రాజుని స్పైడర్ నష్టాల నుండి బాగానే సేవ్ చేసాడనే టాక్ మొదలైంది. ఇప్పుడు దీనిబాట్టి మహానుభావుడు తో స్పైడర్ తెచ్చిన నష్టాన్ని కవర్ చేసుకుంటున్నాడు దిల్ రాజు.

Similar News