ఈ ట్వీట్ చాలు మెగా ఫ్యాన్స్ కి

Update: 2018-04-02 10:06 GMT

రామ్ చరణ్ కి మగధీర తర్వాత మళ్ళీ అంతటి పేరొచ్చింది మాత్రం 2015 లో విడుదలైన ధ్రువ సినిమాకే. మళ్ళీ ధ్రువ తర్వాత నటుడిగా ఫుల్ మార్కులు పడింది మాత్రం తాజాగా విడుదలైన రంగస్థలం చిత్రానికే. రంగస్థలంలో చిట్టిబాబుగా, చెవిటివానిగా రామ్ చరణ్ నటనను విమర్శకులు సైతం తెగ పొగిడేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు నటనకు వెయ్యినోళ్ల పొగుడుతున్నారు. రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరనుండి అనేకమంది చరణ్ ని పొగిడేస్తున్నారు. రానా వంటివారు తాజాగా చరణ్ నటనను మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ని పొగిడిన లిస్ట్ లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాయడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చూసి ఎంతగా మెచ్చుకున్నాడో... ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసి చిట్టిబాబు అదేనండి రామ్ చరణ్ ని తెగపొగిడేస్తున్నాడు. 'ఇప్పుడే రంగస్థలం చూశాను. నీకు హ్యాట్సాఫ్ చెబుతున్నా చరణ్. ఇప్పుడు నీకు దక్కుతున్న అన్ని ప్రశంసలు.. పొగడ్తలకు పూర్తిగా అర్హుడివి. ఈ పాత్రను ఇంతకంటే గొప్పగా ఎవరూ పోషించలేరు. ఆ పాత్రకు గౌరవం తెచ్చావ్' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చెయ్యగా... దానికి చరణ్ కూడా థాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు. మరి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసందే.

ఇప్పుడు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా రాజమౌళి మల్టీస్టారర్ సినిమా ద్వారానే వీరిద్దరి కాంబో బాగా హైలెట్ అవుతున్న వేళ ఇలా చెర్రీ రంగస్థలాన్ని ఎన్టీఆర్ పొగడడాన్ని మెగా ఫాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రంగస్థలం హిట్ తో పాటు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ పొగిడిన ట్వీట్ ని కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని వీక్షించిన ఎన్టీఆర్ సినిమా దర్శకుడు సుకుమార్ ని కూడా పొగిడేసాడు. అంతేకాకుండా సమంత నటనను, జగపతి బాబు విలనిజంతో పాటుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీని కూడా ఎన్టీఆర్ పొగడ్తలతో ముంచెత్తాడు.

Similar News