ఈ ఇద్దరి టార్గెట్ 100 కోట్లా?

Update: 2018-03-22 08:47 GMT

ఇప్పడు ఒక పక్క రంగస్థలం సినిమా విడుదల ముచ్చట్లతోపాటుగా... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి జై లవ కుశ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకోసం రేడి అవుతున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తో కాస్త దెబ్బతిన్న దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసినప్పటికీ అజ్ఞాతవాసి ఫలితంతో త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

అందుకే అజ్ఞాతవాసి సినిమా విడుదలై మూడు నెలలు కావొస్తున్నా ఎన్టీఆర్ స్క్రిప్ట్ ని పక్కా చేశాకే సెట్స్ మీదకెళ్లాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. అయితే ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకం లేదంటూ కొన్ని రూమర్స్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక త్రివిక్రంపై ఎన్టీఆర్ ఎలాంటి ఒత్తిడి తేకపోయినా స్క్రిప్ట్ విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉన్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గాని.. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం పూర్తి ఫిట్ గా తయారవుతున్నాడట. అలాగే ఈ సినిమా కథ మొత్తం ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేయడం వల్ల క్యారెక్టర్‌కి అనుగుణంగా ఎన్టీఆర్‌ బాడీ పెంచుతున్నాడట.

ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా ని 100 కోట్ల టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారనే టాక్ వినబడుతుంది. అజ్ఞాతవాసిలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా త్రివిక్రమ్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో త్రివిక్రమ్ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నాడనే టాక్ కూడా ఉంది. ఇకపోతే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా ఫైనల్ గా ఏప్రిల్ 12 న సెట్స్ మీదకెళుతుందని సమాచారం.

Similar News