ఇల్లి బేబీ నిజం ఒప్పేసుకుంది

Update: 2018-03-26 04:28 GMT

ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో హిట్ కొట్టి అక్కడ మరిన్ని అవకాశాలు దండుకోవాలని చూస్తుంది. మరోపక్క ఇల్లి బేబీ తన బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అయిన ఆండ్రూని రహస్యంగా వివాహం చేసుకుందనే న్యూస్ ప్రింట్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. కానీ ఇలియానా మాత్రం తన పెళ్లిని సీక్రెట్ గానే ఉంచింది గాని ఎక్కడా.. పెళ్లి వార్తల్ని ఖండించలేదు. దీన్ని బట్టి అందరూ ఇలియానా కి వివాహమైందని ఫిక్స్ అయ్యారు. ఇపుడు ఇదే విషయాన్నీ ఇలియానా కూడా ఒప్పేసుకుంది.

ఎలా అంటే.. బాలీవుడ్ రైడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఇలియానా తన భర్త ఆండ్రూ నీబోన్ బెస్ట్ అంటూ తన భర్త ఆండ్రూని తెగ పొగిడేస్తోంది. మరి ఇప్పటివరకు తన భర్త అని సంభోదించని, తన పెళ్లి గురించి స్పందించని ఇలియానా ఒక్కసారిగా తన భర్త గురించి ఎందుకు బయట పెట్టిందో తెలుసా... తనకి ఈమధ్యన ఆరోగ్యం బాగాలేనప్పుడు తన భర్త ఆండ్రూ నీబోన్ దగ్గరుండి తనకి సేవలు చేసాడని... అందుకే ఆండ్రూ నీబోన్ చాలా బెస్ట్ అంటూ కితాబునిచ్చేస్తుంది.

అలాగే తనకు దగ్గరుండి ఎలాంటివి పెట్టాలో అనే విషయంలో తానే స్వయంగా వండి మరి తినిపించేవాడని చెప్పిన ఇలియానా తన భర్త ఆండ్రూ వంటకు సంబంధించి ఓ ఫొటోని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి పెళ్లయింది అని ఇలియానా ఇలా చెప్పకనే చెప్పేసింది కదూ. మరి పెళ్ళైతే సీక్రెట్ గా చేసుకుంది కానీ కనీసం అయినవాళ్లకయినా కాస్త గ్రాండ్ గా రిసెప్షన్ అన్నా ఇవ్వాల్సింది అంటున్నారు ఇలియానా అభిమానులు.

Similar News