ఇలా చెయ్యకపోతే అస్సలు నిద్ర పట్టదు!!

Update: 2017-09-18 16:00 GMT

ఇలియానా బాలీవుడ్ లో నటించిన తాజా చిత్రాలు రెండూ బోల్తా కొట్టాయి. హాట్ హాట్ గా రెచ్చి పోయిన ఇల్లీబేబికి ఆ రెండు సినిమాలు షాక్ ఇచ్చాయి. అయినా అమ్మడు ఏమాత్రం తగ్గదు. ఇంతకుముందే స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ వేసుకుని జలకాలాడిన ఇలియానా ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం అయ్యింది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తానొకదాన్ని ఉన్నానంటూ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటుంది. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూ నీబోన్‌ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.

ఫొటోగ్రాఫర్ తో ప్రేమాయణం....

ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఇలియానా అతన్ని పెళ్లి కూడా చేసుకుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి. సినిమా షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబైలో కామ్ గా వుంటూ షూటింగ్ లో పాల్గొనే ఇల్లి బేబీ షూటింగ్స్ అయిపోగానే బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూ నీబోన్‌ దగ్గర వాలిపోయి విహార యాత్రలకు చెక్కేస్తుంది. అలా చెక్కేసే ఇలియానా తాను ఆండ్ర్యూ నీబోన్‌తో ఎంత ప్రేమగా వున్నది ఫొటోస్, వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా తాజాగా ఇలియానా ఆండ్ర్యూ నీబోన్‌తో బాగా క్లోజ్ గా ఉన్న ఫోటొస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇల్లి బేబీ దానికింద ‘ప్రేమ అనే పిచ్చిలోకంలో’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. మరి అంత పిచ్చిగా ప్రేమించేస్తున్న ఆండ్ర్యూ నీబోన్‌తో పెళ్ళికి సిద్దపడొచ్చుగా... ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావ్ ఇల్లీ బేబీ అంటూ నెటిజెన్ల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Similar News