ఇప్పుడడిగితే పోయేదే?

Update: 2017-11-12 06:00 GMT

పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఒక్కసారిగా స్టార్ లెవల్లో మార్చేసిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి ఇప్పటికి బుల్లితెర మీద మంచి ఆదరణ ఉంది. అయితే ఆ సినిమా లో వచ్చే అంత్యాక్షరి సీక్వెన్స్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమాలోని ఆ అంత్యాక్షరి సీన్ తర్వాత అందులో నటించిన నటీనటులంతా ఒక్కసారిగా ఫెమస్ కూడా అయ్యారు. ఆ అంత్యాక్షరిలో దర్శకుడు హరీష్ శంకర్ అనేక సిఎంమాల్లోని పాటలను కమెడియన్స్ చేత అంత్యాక్షరిగా ఆడించాడు.

అయితే దాంట్లో హీరో రాజశేఖర్ ని ఇమిటేట్ చేసే ఒక బిట్ కూడా ఉంటుంది. గబ్బర్ సింగ్ విడుదల తర్వాత... పవన్ కళ్యాణ్ అలా నన్ను ఇమిటేట్ చేయడం చాలా బాధాకరమని రాజశేఖర్ చాలా సందర్బాలలో చెప్పాడు. అయితే తాజాగా మళ్ళీ రాజేశేఖర్ 'పి ఎస్ వి గరుడవేగా' ప్రమోషన్స్ లో భాగంగా ఆ టాపిక్ ని తీసుకువస్తూ... ఆ సీన్లో ఆలీ కూడా ఉండటం తనను మరింత బాధ పెట్టిందని చెప్పుకొచ్చాడు. తనకు ఎంతో సన్నిహితుడైన ఆలీ ఆ సన్నివేశంలో నటించడంతో తాను ఫీలయ్యానని రాజశేఖర్ అన్నాడు.

అసలు పవన్ కళ్యాణ్ అలాంటి సీన్ చేయాలని అనుకున్నపుడు ఆలీ వద్దు అని చెప్పి ఉండాల్సిందని రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. ఆలీ తనకు క్లోజ్ అని ఆ సీన్ వద్దని అతను వారించాల్సిందని.... అలా కుదరని పక్షంలో కనీసం తననైనా ఆ సీన్ నుంచి తప్పించమని దర్శకుడిని ఆలీ అడిగి ఉంటే బాగుండేదని రాజశేఖర్ అన్నాడు. కానీ ఆలీ ఆ సీన్ చేయడం తనకు బాధ కలిగించిందని.... తనను ఆలీ కలిసినపుడు ఈ విషయం అడుగుదామని కూడా అనుకున్నానని... కానీ అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకని వదిలేశానని రాజశేఖర్ వెల్లడించాడు. మరి రాజశేఖర్ తన తాజా చిత్రం పిఎస్వీ లో అలీ నటించాడు కాబట్టి... ఇప్పుడైనా అలీని ఆ విషయం అడిగి ఉండాల్సింది.

Similar News