ఇప్పటికైనా పంపిణీదారుల గురించి ఆలోచిస్తారా?

Update: 2018-01-12 13:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలు అవసరం లేదు, ఆయన అభిమానులు చిత్ర ప్రచారాన్ని తమ భుజ స్కంధాలపై మోసి విజయ శిఖరాన్ని ఎక్కిస్తారని అజ్ఞ్యాతవాసి నిర్మాత సూర్యదేవర రాధా కృష్ణ ఆశపడ్డట్టున్నారు. అందుకే చిత్ర ప్రొమోషన్స్ కోసం చిల్లి గవ్వైనా ఖర్చు చేయలేదు. క్రేజ్ వున్న హీరో సినిమాకి కూడా పబ్లిసిటీ అవసరం అని వీరికి రజని కాంత్ సినిమాల ప్రణాళికల ద్వారానైనా అర్ధం ఐయి ఉండాలి. రజని కాంత్ కంటే ఎక్కువ క్రేజ్ వున్న యాక్టర్ అయితే కాదు కదా పవర్ స్టార్.

కాంబినేషన్ క్రేజ్ చూపించి భారీ రేట్లకి అన్ని ప్రాంతాల విడుదల హక్కులని పంపిణీదారులకి విక్రయించేసిన హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఇప్పటి వరకు ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం డైరెక్టర్ త్రివిక్రమ్, మరియు హీరో పవన్ కళ్యాణ్ లని రంగం లోకి దించలేదు. ఓవర్ సీస్ ప్రేక్షకులని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన చిన్న వీడియో క్లిప్పింగ్ మినహాయిస్తే హీరో, డైరెక్టర్ ఎలాంటి ప్రమోషనల్ ఇంటర్వూస్ ఇవ్వలేదు. మరో వైపు డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా లలో కూడా ఎలాంటి ప్రొమోషన్స్ జరగటం లేదు. సినిమా తెచ్చిపెట్టబోయే నష్టాలకంటే నిర్మాత వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పంపిణీదారులకి ఆవేదన కలిగిస్తుంది. నేటి నుంచి పండుగ బరిలో వున్న మరో రెండు చిత్రాలు థియేటర్స్ కి రావటంతో ఇప్పటికైనా పబ్లిసిటీ గురించి ఆలోచించాలని పంపిణీదారులు కోరుకుంటున్నారు.

Similar News