ఇప్పటికే ఐదు సార్లు పోలీస్ కెమెరాకి చిక్కిన మెగా హీరో కార్

Update: 2017-03-15 04:51 GMT

అభివృద్ధి చెందుతున్న సాంకేతికత పుణ్యమా అని ట్రాఫిక్ పోలీస్ ల చేతికి కెమెరాలు ఇవ్వటంతో నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్ని నడుపుతున్న వారికి తెలీకుండానే కేసు రిజిస్టర్ ఐయి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నిర్దేశిత రుసుము పెనాల్టీ గా చెల్లించవలసినదిగా సదరు వాహన యజమాని ఇంటి చిరునామాకు కేసు తాలూకా వివరాలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనం ఫోటోతో కూడిన ఎక్నాలెడ్జెమెంట్ చేరుతుంది. అలానే రోడ్ ట్రాన్స్ పోర్ట్ వారి అఫిషియల్ వెబ్ సైటు లో సదరు వాహనపు రెజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఆ వాహనంపై వున్న కేసుల చిట్టా మొత్తం దర్శనమిస్తుంది. ఈ పరిణామంతో ఇప్పటికి ఐదు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వాహనం ట్రాఫిక్ పోలీస్ ల కెమెరాకి చిక్కింది.

రామ్ చరణ్ తేజ్ కి చెందిన బ్లాక్ రేంజ్ రోవర్ కార్ పై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలిసుల పరిధిలో ఐదు పెనాల్టీలు ఇంకా పెండింగ్ లో వున్నాయి. వాటిల్లో ఒకటి ఔటర్ రింగ్ రోడ్ పై నిర్ణీత వేగానికి మించిన వేగంతో కార్ నడపటంతో పాటు నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని నిలిపినందుకు గాను మొత్తంగా ఇప్పటికి ఐదు కేసులు చరణ్ రేంజ్ రోవర్ పై నమోదు ఐయి వున్నాయి. ఈ ఐదు ట్రాఫిక్ కేసులు నమోదు కావటంలో రామ్ చరణ్ తేజ్ తప్పు ఎంత ఉందో, అతని డ్రైవర్ తప్పు ఎంత ఉందో అంచనా వేయలేని పరిణామం. ఏది ఏమైనప్పటికి వాహనానికి యజమాని చరణ్ కాబట్టి నష్టం అతనికే.

Similar News