ఇప్పటికి చాలాసార్లే తలపడ్డారుగా!!

Update: 2017-01-05 00:00 GMT

బాలకృష్ణ, చిరంజీవి సంక్రాతి బరిలో పోటా పోటీగా దిగుతున్నారు. ఇక బాలకృష్ణ కెరీర్లో 100 వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి , చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 తో పోటీకి దిగారు. ఏదో ఇద్దరి మధ్యన ఏంలేదంటూనే ఇంత గట్టి పోటీని ఇస్తున్న వీరు ఇంతకుముందు కూడా చాలాసార్లే తలపడ్డారు. వీరు తమ కెరీర్ లో దాదాపు 14 సార్లు తలపడినట్లు ఇప్పటి పోటీ 15 వ సారిగా అంటున్నారు. ఇక వారు తలపడిన సినిమాల పేర్లు మీకోసం.

మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టు - 1984

కథానాయకుడు – రుస్తుం - 1984

ఆత్మబలం – చట్టంతో పోరాటం - 1985

నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా - 1986

అపూర్వ సహోదరులు – రాక్షసుడు - 1986

భార్గవ రాముడు – దొంగ మొగుడు - 1987

రాము – పసివాడి ప్రాణం - 1987

ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగ - 1988

రాముడు భీముడు – యుద్దభూమి - 1988

పెద్దన్నయ్య – హిట్లర్ - 1997

వంశోద్ధారకుడు – అన్నయ్య - 2000

నరసింహ నాయుడు – మృగరాజు - 2001

భలేవాడివి బాసు – శ్రీ మంజునాథ - 2001

లక్ష్మీ నరసింహ – అంజి - 2004

ఇక తాజాగా ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నంబర్ 150 - 2017... మరోసారి బరిలోకి దిగుతున్నారు. మరి ఈ 15 వసారి గెలుపెవరిదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు.

Similar News