ఇద్దరికీ సరిసమానంగానే...!!

Update: 2017-04-30 16:57 GMT

రాజమౌళి పేరు ఇప్పుడు 'బాహుబలి' చిత్రంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది. అసలు బాహుబలి సినిమా తియ్యకముందే రాజమౌళికి 'మగధీర, ఈగ' చిత్రాలతో పెద్ద పేరొచ్చింది. ఇక బాహుబలితో ఇప్పుడు చరిత్రలో నిలిచిపోవడానికి రెడీ అయ్యాడు. అసలు ఏదైనా సినిమా వస్తే అందులో నటించిన హీరోలకే బాగా పేరొస్తుంది. కానీ రాజమౌళి తీసే చిత్రాలకు మాత్రం హీరోతోపాటే దర్శకుడు రాజమౌళికి అంతే పేరొస్తుంది. ఇకపోతే హీరోల మీద అభిమానంతో ఫ్యాన్స్ సినిమాలు విడుదలైనప్పుడు వారికి కటౌట్స్ పెట్టి వారు ఆ హీరోలను ఎంతగా ఆరాధిస్తున్నారో చెప్పకనే చెబుతారు. అంతేగాని అది తీసిన డైరెక్టర్ కు గాని అందులో నటించిన మరే ఇతర నటులకు గాని కటౌట్స్ పడవు.

కానీ 'బాహుబలి' చిత్రానికి మాత్రం అలా కాకుండా ప్రభాస్ కటౌట్స్ తోపాటు రాజమౌళి కటౌట్స్ కూడా థియేటర్స్ దగ్గర దర్శనమిచ్చాయంటే రాజమౌళికి ఉన్న రేంజ్... క్రేజ్ ఏమిటో అర్ధమవుతుంది. అసలు రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అలా ఉంటుంది రాజమౌళి బ్రాండ్. అయితే ఒక్కో చిత్రానికి హీరో కంటే రాజమౌళికి ఎక్కువ మార్కులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు బాహుబలి విషయంలో ప్రభాస్ కి బాహుబలిగా నటించినందుకు ఎన్ని మార్కులు పడ్డాయో ఆ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి అన్నే మార్కులు పడ్డాయి.

ప్రభాస్ బాహుబలిగా ఒక రారాజులా మెరిసిపోతుంటే రాజమౌళి మాత్రం దర్శక ధీరుడిగా మెరిసిపోతున్నాడు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రజెన్స్ వంటి విషయాల్లో నిజగా రాజునే తలపిస్తున్నాడనే కామెంట్స్ పడుతున్నాయి.

Similar News