ఇద్దరి మధ్య ఉంటే చచ్చిపోతానేమో.....

Update: 2017-02-16 13:49 GMT

బొంబాయి కథానాయికలకు సైజు జీరో స్ట్రక్చర్ ని పరిచయం చేసిన ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఖాన్ గత ఏడాది డిసెంబర్ 20 న ఒక మొగ బిడ్డకు జన్మ నిచ్చిన నాటి నుంచి పెద్దగా కెమెరా ని పేస్ చెయ్యలేదు. కరీనా కపూర్ గర్భవతిగా వున్నప్పుడు షూట్ చేసిన ఒక వీడియో ఇంటర్వ్యూ ఇప్పుడు టెలికాస్ట్ ఐయి అధిక టీ.ఆర్.పి రేటింగ్స్ దక్కించుకుంది. వోగ్ మ్యాగజాయిన్ నిర్వహిస్తున్న బి.ఎఫ్.ఎఫ్ షో మొదటి సీజన్లో రెండవ ఎపిసోడ్ కి కరీనా కపూర్ అతిధి అయినప్పటికీ ఈ ఎపిసోడ్ గత ఏడాది డిసెంబర్ నెల కంటే ముందే షూట్ చేయబడింది. ఈ ఇంటర్వ్యూ లో అసలు ఏమాత్రం తడబడకుండా ప్రతి ప్రశ్నకి రేపిడ్ ఫైర్ తరహాలో సమాధానాలు ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బెబో.

కరీనా ని ముగ్గురు ప్రాణ స్నేహితుల పేర్లు అడగగా తన సోదరి కరీష్మా కపూర్ తో పాటు అమృత అరోరా, మలైకా అరోరా ఖాన్ ల పేర్లు చెప్పింది. తన క్రష్ గురించి అడగగా బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది కరీనా. గర్ల్ క్రష్ ఎవరైనా వున్నారా అన్న ప్రశ్నకు, నాకే ఇంత అందమైన పర్సొనాలిటీ ఉండగా వేరే అమ్మాయిలపై క్రష్ ఎందుకు ఏర్పడుతుంది అంటూ బోల్డ్ గా ఎదురు ప్రశ్నించింది బెబో.

రన్బీర్ కపూర్, కత్రినా ఖైఫ్ లమధ్య గడపాల్సి వస్తే ఏమి చేస్తారు అన్న ప్రశ్నకి చచ్చిపోతానేమో అంటూ సమాధానమిచ్చి అందరిని కాసేపు నవ్వించింది. జీవితంలో చివరి ఫోన్ కాల్ అని తెలిసిన తరువాత మీరు ఎవరితో ఆ ఫోన్ సంభాషణ జరపటానికి ఇష్టపడతారు అని అడగగా, తన తల్లితో మాట్లాడతానని బదులిచ్చింది కరీనా కపూర్ ఖాన్.చాలా ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూ లో ఏ మాత్రం తడబాటు లేకుండా వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రశ్నలకు రేపిడ్ ఫైర్ తరహాలో స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇచ్చింది కరీనా కపూర్.

Similar News