ఇద్దరి నిర్మాతలు కొట్టుకునేలా ఉన్నారుగా..?

Update: 2017-10-29 08:56 GMT

వక్కంతం వంశి దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని కూడా ప్రకటించాడు అల్లు అర్జున్. ఎట్టిపరిస్థితుల్లో 'నా పేరు సూర్య' సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న విడుదల చేస్తామని గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మహేష్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' సినిమాను కూడా అదే తేదీని అంటే ఏప్రిల్ 27 నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి మహేష్ అల్లు అర్జున్ తో పోటీ పడుతున్నాడా? అసలు మహేష్ ఆ తేదీని అధికారికంగా ప్రకటించాడు... కాబట్టి అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమా వాయిదాపడినట్టేనని చాలామంది భావించారు.

ఇక అల్లు అర్జున్ కూడా స్వతహాగా ఎవరి సినిమాతో పోటీకి దిగుడు అందుకే... ఈ ఏప్రిల్ 27 నుండి వెనక్కి తగ్గుతాడనుకుని చాలామందే ఫిక్స్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ కూడా తగ్గేది లేదంటున్నాడు. 'నా పేరు సూర్య' నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు..మహేష్ 'భరత్ అనే నేను' సినిమా విడుదల గురించి మాట్లాడుతూ..... సినిమా పరిశ్రమ చాలా పెద్దది. నాతో పాటు వాళ్లు అంటే 'భరత్ అనే నేను' నిర్మాతలు కూడా ఏప్రిల్ 27 నే తమ సినిమా వస్తుందని ఎనౌన్స్ చేశారు. అలాగే నా సినిమాతో పాటు వాళ్ల సినిమా కూడా ప్రాసెస్ లో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ముందు ప్రకటించింది మాత్రం మేమే అనడమేకాదు..... 'భరత్ అనే నేను' నిర్మాత దానయ్య గారు ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా ఇలా ఎనౌన్స్ చేయడం కొంచెం బాధాకర విషయమే.

తమ భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 27 న వస్తుంది అని ప్రెస్ కు ప్రకటించిన తర్వాత ఆ సినిమా నిర్మాత ది వి వి దానయ్య గారు ఇప్పుడొచ్చి మమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు కదా. అసలు మమ్మల్ని సంప్రదించకుండా దానయ్య గారు ఇలా చేయడంతో నేను హర్ట్ అయ్యాను.అని మహేష్ 'భరత్ అనే నేను' సినిమా విడుదలపై స్పందించాడు.

అంతేకాకుండా ఇంకా బన్నీ వాసు.. ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన 'జులాయి', రాజమౌళి గారి 'ఈగ' సినిమాల విషయంలో ఇలాంటి విడుదల గొడవే వస్తే..... 'ఈగ 'కోసం తమ 'జులాయి' సినిమాను ఏకంగా 3 వారాలు వాయిదావేశామని చెప్పడమే కాదు.... ఇప్పుడు కూడా వచ్చి నిర్మాత దానయ్య ఈ విషయమై మామామల్ని కలిసి కూర్చుని మాట్లాడితే ఈ విషయం సెటిల్ అయిపోయేదని..... అడక్కుండా ప్రకటించడం కొంచెం కూడా బాగాలేదంటున్నాడు బన్నీ వాసు. చూద్దాం ఈ విషయం ఇంకెంత ముదురుతుందో..

Similar News