ఇదైనా ఫైనలేనా ..?

Update: 2017-08-02 13:00 GMT

ప్రభాస్ 'బాహుబలి' కోసం ఐదేళ్లు కష్టపడి... ఆ సినిమాతో ఎప్పటికి గుర్తుండిపోయే మంచి విజయాన్ని తన జేబులో పెట్టుకున్నాడు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్, సుజిత్ డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జూన్ మొదటివారంలోనే మొదలైంది. షూటింగ్ మొదలై ఇన్నిరోజులు గడుస్తున్నప్పటికీ ప్రభాస్ పక్కన సాహోలో నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనేవుంది.

ముందుగా బాలీవుడ్ హీరోయిన్స్ ని సాహోలో తీసుకుంటే ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వస్తుందని... అనుకున్నారు. కాదు కాదు ప్రభాస్ పక్కన అనుష్క మరోసారి నటించబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ అనుష్క కొంచెం లావుగా ఉండడంతో ప్రభాస్ పక్కన బాగోదని ఆమెని తప్పించారని టాక్ కూడా వినబడింది. ఇక సాహో చిత్రానికి ఎక్కువమంది బాలీవుడ్, కోలీవుడ్ నటులనే తీసుకుంటున్నారు. మరి హీరోయిన్ కూడా బాలీవుడ్ భామ అయితే బావుంటుందని పరిణితి దగ్గర నుండి కత్రినా వరకు సాహోలో నటించబోతున్నారనే వార్తలు హల్చల్ చేసాయి. మధ్యలో ఏమైందో ఏమో బాలీవుడ్ ని పక్కన పెట్టి ఇతర భాష హీరోయిన్స్ పై దృష్టి సారించారు.

కానీ ఇప్పుడు మరోసారి సాహోలో ప్రభాస్ పక్కన నటించబోయేది బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ అంటూ వార్తలొస్తున్నాయి. శ్రద్దా కపూర్ అయితే బడ్జెట్ కి సూట్ అవుతుంది, మరోపక్క ప్రభాస్ పక్కన మంచి ఫిజిక్ తో నటించగల సత్తా ఉన్నందున ఫైనల్ గా శ్రద్దా కపూర్ నే సాహో కి తీసుకురానున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ఇక సాహో చిత్రాన్ని హాలీవుడ్ స్టాండ్డ్స్ తో ముంబాయ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేసిన దర్శకుడు సుజిత్ అండ్ టీమ్.. త్వరలో అబుధబికి వెళుతుందని చెబుతున్నారు. ఇక అబుదాబి మరియు ఇతర యురోపియన్ కంట్రీస్ లో సాహో షూటింగ్ చేసిన తర్వాత హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ చెయ్యాలనే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.

Similar News