ఇదే ఫిక్స్...

Update: 2017-10-26 09:00 GMT

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం... ఇది చాలా రోజుల నుండి ప్రచారంలో ఉన్న వార్త. అదిగో.. ఇదిగో.. మోక్షు వస్తున్నాడంటున్నారు గాని... ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక బాలకృష్ణ ఏమో 2019 జూన్ లో మోక్షజ్ఞ సినిమారంగ ప్రవేశం అని ప్రకటించాడు. అయితే అది ఎన్టీఆర్ బయో పిక్ లేకుంటే మోక్షజ్ఞ హీరో గానా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ముందునుండి ప్రచారం జరుగుతున్నట్టే మోక్షజ్ఞ అరంగేట్రంలో 'ఎన్టీఆర్ బయో' పిక్ లో నటించడం అటుంచి... సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో... 'ఆదిత్య 369 ' సీక్వెల్ లోనే మోక్షజ్ఞ తెరంగేట్రం చేయనున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే శ్రీనివాస్ రావు 'ఆదిత్య 369 ' సీక్వెల్ స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నారని... ఇక ఆ స్క్రిప్ట్ ని బాలకృష్ణ ఒకసారి చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో బాలకృష్ణకూ ప్రామినెంట్ రోల్ ఉన్నా కూడా..... మెయిన్ హీరో మోక్షజ్ఞ అని తెలుస్తుంది. ఇక మోక్షజ్ఞ కి హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారో అన్ని పరిశీలించి హీరోయిన్ ని ఎంపిక చెయ్యడం ఇంకా మిగిలుందనే వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ చిత్రానికి బాలకృష్ణ ఒకే చెప్పడమే తరువాయి.... సినిమా అధికారికంగా మొదలెట్టుకుని.... సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

కానీ ఈసారి ఈ వార్త మాత్రం ఫిక్స్ అనే సంకేతాలు వస్తున్నాయి. ఈ వార్త అంటే... సింగీతం దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం అనేది. మరి బాలయ్య ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా... ఎప్పుడు మోక్షజ్ఞ ని కనులారా వీక్షిద్దామా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Similar News