ఇక్కడ సమంత.. అక్కడ మాత్రం..?

Update: 2017-12-11 14:00 GMT

గత సంవత్సరం కన్నడంలో ‘యూటర్న్‌ అనే చిత్రం సంచలన విజయం సాధించింది . కన్నడ ప్రేక్షకుల అభిమానం కూడా విశేషంగా పొందింది . ఈ సంవత్సరం 64వ జాతీయ అవార్డుల కు కూడా ఈ సినిమా వచ్చింది . జ్యూరీ సభ్యులు కూడా దీనిని మెచ్చుకున్నారు . ఒక మహిళా జర్నలిస్ట్ బెంగళూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద వరుసగా జరుగుతున్న యాక్సిడెంట్ల మీద ఆర్టికల్ రాయాలని ప్రయత్నిస్తుంది . అప్పుడు ఆమెకు ఎదురైన అనూహ్య అనుభవాల సారాంశమే ఈ చిత్రం . పవన్ కుమార్ ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించాడు . కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా భారీగా కలక్షన్స్ వాసులు చేసింది . యువతరాన్ని బాగా ఆకట్టుకుంది . ఈ చిత్రంలో మహిళా జర్నలిస్టుగా శ్రద్దా శ్రీనాథ్ నటించింది. ఈ చిత్రం గత సంవత్సరం 20 మార్చి లో విడుదలైంది . పవన్ కుమార్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

తెలుగులో సమంత....

అయితే ఇప్పుడు అదే సినిమాను తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. దీనికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో మహిళా జర్నలిస్ట్ పాత్రను అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత పోషిస్తుండగా.... తమిళ్ లో మాత్రం లేడి ఒరింటెడ్ చిత్రాల స్పెషలిస్ట్ నయన తారను ఎన్నుకున్నారు. మరి తెలుగులో సమంత, తమిళ్ లో నయనతార ఈ సినిమాతో ఏల్నాటి హిట్ కొడతారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనవరి నుంచి ఈ చిత్రం రెండు భాషల్లో నిర్మాణం ప్రారంభం అవుతుంది

Similar News