ఇకనుండి హిట్స్ మాత్రమే కొట్టాలనే కసితో ఉన్నాడు!!

Update: 2017-07-26 10:00 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. తాను హీరోగా చేస్తున్న సినిమాలకు తానే నిర్మాతగా మారడం... ఆ సినిమాల ప్లాపైనా కూడా కళ్యాణ్ రామ్ ఏ మాత్రం మారకుండా మళ్ళీ మళ్ళీ అదే ట్రై చెయ్యడంతో అతని ఆస్తులన్నీ కరిగిపోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయాడు. ఇంతా జరిగాక ఇప్పుడు బాగా బుద్దొచ్చినట్లుంది. అందుకే ఈసారి మాత్రం అన్నీ జాగ్రత్తగా చక్కబెట్టుకుంటున్నాడు. కేవలం చక్కబెట్టడమే కాదు తన మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసి ఈసారి మాత్రం కొడితే హిట్స్ మాత్రమే కొట్టాలనే కసితో బరిలోకి దిగుతున్నాడు.

అందులో భాగంగానే తాను హీరోగా చేస్తున్న 'మంచి లక్షణాలున్న అబ్బాయి' చిత్రాన్ని వేరే బ్యానేర్ లో బయట నిర్మాతలతో చేస్తున్నాడు. అలాగే తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కూడా తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా 'జై లవ కుశ'ని నిర్మిస్తున్నాడు. ఈ 'జై లవ కుశ' తో ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాగా సంపాదించాడని టాక్ బలంగా వినబడుతుంది. మరి తమ్ముడిని నమ్ముకుని భారీగా పెట్టుబడి పెట్టినప్పటికీ టేబుల్ ప్రాఫిట్ అందుకుని ఫుల్ గా సాటిస్పై అయ్యాడంటున్నారు. ఇక ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం కంప్లీట్ కాగానే మరో మినిమమ్ గ్యారెంటీ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట కళ్యాణ్ రామ్.

ఈసారి కళ్యాణ్ రామ్ వరుస హిట్స్ తో దూసుకుపోతూ నిర్మాతలకు బెస్ట్ ఛాయస్ గా నిలుస్తున్న హీరో నాని తో ఒక సినిమా కి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. మరి నానితో సినిమా సెట్ అయితే ఈసారి కళ్యాణ్ రామ్ ఆచితూచి అడుగులు వేసి పక్కా ప్లానింగ్ తో దూసుకుపోయినట్లే అంటున్నారు.

Similar News