ఇంతకీ రాజశేఖర్ చేస్తున్నాడా లేడా?

Update: 2018-03-31 12:04 GMT

రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టార్రర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉండంగానే సినిమాపై బోలెండత క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాకు హీరోలు తప్ప మిగతా కాస్టింగ్ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ ఏం రాలేదు. దీంతో ఈ సినిమాపై రూమర్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి.

ఈ మల్టీ స్టార్రర్ లో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ చేయనున్నాడనే వార్త ఫిలింనగర్ లో గత వారం నుండి హల్చల్ చేస్తుంది. రాజశేఖర్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు. దీంతో అంత, రాజశేఖర్ రోల్ టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించారు. అయితే రాజశేఖర్ భార్య జీవిత ఈ టాక్ ను కొట్టిపారేసింది.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ మూవీలో విలన్ గా రాజశేఖర్ నటించాలంటూ రాజమౌళి నుంచి తమకు ఎలాంటి ఆఫర్ రాలేదని తేల్చి చెప్పేసింది. తన కూతురు శివాని - అడివి శేష్ సినిమా ఓపెనింగ్ కు రావాలని రాజమౌళిని కలిసి ఆహ్వానించామని..దీంతో ఈ వార్త ఆలా బయటికి వచ్చి ఉంటుందని జీవిత అంటోంది. రాజమౌళి సినిమాల్లో విలన్ కు మంచి పేరు వస్తుంది. దీంతో అంత రాజశేఖర్ ను ఓ కొత్త యాంగిల్ లో చూడొచ్చని భావించారు కానీ ఈలోపే జీవిత బాంబు పేల్చి ఇది రూమర్ అని కొట్టిపారేసింది.

Similar News