ఇంతకీ కాజల్ ఉందా? లేదా?

Update: 2017-10-07 13:00 GMT

నాగార్జున మెంటలిస్ట్ గా.. సమంత ఆత్మగా నటించిన రాజుగారి గది 2 సినిమా ఒక వారం రోజుల్లోనే విడుదలకు సిద్ధమయ్యింది. ఓం కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అశ్విన్, సీరత్ కపూర్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నప్పటికీ సినిమా మొత్తం నాగార్జున, సమంత భుజాలమీదే మోసినట్టుగా ప్రమోషన్స్ లో తెలుస్తుంది. ఇప్పటికే రాజుగారి గది 2 ప్రమోషన్స్ లో నాగార్జున జోరుగా పాల్గొని.. ఈ సినిమా విషయంలో తన వంతు ప్రమోషన్ పూర్తి చేసాడు నాగ్. తన కోడలు సమంత సినిమాలో చాలా భయాన్ని కలిగిస్తుందని ఇప్పటికే చెప్పేసిన నాగ్ ఈసినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పేంచేసాడు.

పీక్స్ లో క్లయిమాక్స్.....

ఇక రాజుగారి గది 2 సినిమా క్లైమాక్స్ పీక్స్ లో ఉందని... ఆ క్లైమాక్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారనే టాక్ వినబడుతుంది. ఇకపోతే రాజుగారి గది 2 లో మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ క్యామియో రోల్ చేస్తున్నట్టుగా ఆమధ్య కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు దగ్గరయినా ఆ విషయాన్నీ చిత్ర బృందం ఎక్కడా కన్ఫర్మ్ చెయ్యలేదు. కాజల్ రాజుగారి గదిలో ఉన్నట్టుగా ఎక్కడా క్లారిటీ లేదుగాని.... ఇప్పుడు మరోసారి ఈ న్యూస్ తెర మీదకొచ్చింది. కాజల్ కూడా రాజుగారి గదిలో సమంత తోపాటు మరో దెయ్యంలా కనబడనుందని ప్రచారం మొదలైంది.

రెండు మూడు రోజులు ముందు.....

మరి సినిమా విడుదల సమయం దగ్గర పడుతుంది కానీ.. కాజల్ విషయాన్నీ చిత్ర బృందం కన్ఫర్మ్ చెయ్యడం లేదు అంటే.. సినిమా కి రెండు మూడు రోజుల ముందు కాజల్ గురించి రివీల్ చేసి... రాజుగారి గదిపై మరిన్ని అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఇక రాజుగారి గది 2 సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. రాజుగారి గదికి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మరి భారీ అంచనాల మధ్యన విడుదలవుతున్న రాజుగారి గది 2 ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూద్దాం.

Similar News