ఇండియన్ సినిమా ఎరగని అరుదైన లొకేషన్లుట!

Update: 2016-11-29 17:51 GMT

యువత, కందిరీగ, డిక్టేటర్ తో పాటు పలు చిత్రాలలో మెరిసిన అక్ష పార్దాసాని కి చెప్పుకోదగ్గ విజయాలు కానీ అవకాశాలు కానీ తెలుగు, మళయాళ చిత్ర పరిశ్రమల్లో దక్కలేదు. కానీ అదృష్టవ శాత్తు అక్ష కు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సువర్ణావకాశం దక్కింది. చిత్ర కథ కథనాలు గురించిన వివరాలు తెలియనప్పటికీ అక్ష ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'లవ్ యు ఫామిలీ' ఒక అరుదైన చరిత్ర సృష్టించింది. ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశమే ఈ చిత్రానికి ఆ ఘనత సాధించిపెట్టింది.

భారతీయ చిత్రాలు ఇప్పటివరకు కజికిస్థాన్ దేశంలో చిత్రీకరణ జరుపుకున్న దాఖలాలు లేవు. సచ్ఛీంద్ర శర్మ దర్శకత్వంలో ఏబీసీడీ ఫేమ్ సల్మాన్ యూసుఫ్ ఖాన్, అక్ష పార్దాసాని జంటగా నటిస్తున్న లవ్ యు ఫామిలీ చిత్రంలో ఎక్కువ భాగం కజికిస్థాన్ దేశంలో తెరకెక్కుతుంది. అక్కడి ప్రజలు చాలా సహకారం అందిస్తున్నారని, ఎన్నో అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకునే విధంగా అనుమతుల విషయంలో వెసులుబాటు కలిపించారు అని అక్ష తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అంతే కాక మన బాలీవుడ్ చిత్రాలను అక్కడి ప్రజలు తరచు చూస్తుంటారంట. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి లకు కజికిస్తాన్లోనూ అభిమానులు వున్నారని తెలిపింది అక్ష.

Similar News