ఆహా తొలిప్రేమ క్రేజ్ మాములుగా లేదుగా

Update: 2018-02-17 05:49 GMT

ఒకప్పుడు బొద్దుగా వుంది అవకాశాలు లేక దిగాలు పడి... బాడీ మీద కాన్సంట్రేట్ చేసి మరీ బరువు తగ్గిన రాశి ఖన్నాకి కాలం కలిసొచ్చినట్లే ఉంది. ఇలా నాజూగ్గా అయ్యాక వరుణ్ తేజ్ తో కలిసి తొలిప్రేమ లాంటి అద్భుతమైన హిట్ అందుకుంది అమ్మడు. వెంకీ అట్లూరి దర్శకత్వములో తెరకెక్కిన తొలిప్రేమ సినిమా సూపర్ హిట్ అయ్యి... సునామి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి ఆ సినిమాలో రాశి ఖన్నా వర్ష పాత్రలో అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఎప్పుడూ బొద్దుగా అస్సహ్యంగా ఉండే రాశి ఖన్నా తొలిప్రేమలో సన్నని నడుముతో సన్నజాజిలా తయారైంది. మరి ఆమెకి తొలిప్రేమలో చేసిన వర్ష పాత్ర కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర.

అయితే అలా తొలిప్రేమతో హిట్ అందుకుందో లేదో... ఇలా రాశి ఖన్నా కి మంచి అవకాశాలు అలా స్టార్ట్ అయ్యాయి. అయితే తొలిప్రేమలో రాశి ఖన్నా హీరోయిన్ అంటే ముందు భయపడ్డ దిల్ రాజు తొలిప్రేమ చూసిన తర్వాత రిలీఫ్ అవ్వడమే కాదు రాశి ఖన్నా పెరఫార్మెన్స్ ని మెచ్చుకున్నాడు కూడా. అలాంటి దిల్ రాజు మరోమారు రాశి ఖన్నా కి ఒక మంచి సినిమాలో ఆఫర్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా నితిన్ లాంటి యంగ్ హీరో పక్కన. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటించబోయే శ్రీనివాస కల్యాణంలో రాశి ఖన్నాని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

అయితే ప్రస్తుతం నితిన్ సరసన దిల్ రాజు ఛలో హీరోయిన్ రష్మిక మందన్న ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లుగా వార్తలొచ్చిన నేపథ్యంలో రాశి ఖన్నాని శ్రీనివాస కల్యాణంలో రెండో హీరోయిన్ గా తీసుకున్నారా... లేదంటే రష్మిక ప్లేస్ లో రాశి ఖన్నానికి అవకాశం ఇచ్చారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Similar News