ఆయనకారణంగానే ఇలా ఉన్నా!!

Update: 2017-06-30 03:30 GMT

ఈ మాటన్నది ఎవరో కాదు బాలీవుడ్ ముదురు భామ టబు. ఇప్పటికే వయసు 40 దాటినా పెళ్ళిమాటెత్తకుండా సింగిల్ గా ఉంటున్న టబు ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఇక టాలీవుడ్ లో కూడా నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలందరితో నటించిన ఈ భామ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. తరగని అందంతో ఇప్పటికి ఈ వయసులోనూ మెరిసిపోతున్న టబుకు ఎక్కడికెళ్లినా మీ పెళ్ళెప్పుడు అంటూ మీడియా చాలాకాలంనుండి వెంటపడుతూనే వుంది. కానీ ఎప్పుడూ టబు తన పెళ్లి విషయమై స్పందించలేదు.

కానీ ఇప్పుడు ఇన్నాళ్ళకి తన పెళ్లి ఒక బాలీవుడ్ హీరో వల్లే అవ్వలేదని చెప్పి బాలీవుడ్, టాలీవుడ్ కి కలిపి షాకిచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం టబు చాలా సరదాగా చేసినవే సుమా. మీరు ఇది చూసి షాకవ్వకండి. మీరూ సరదాగా నవ్వేసుకోండి. ఇక టబు చెప్పిన పెళ్లి ముచ్చట ఏమిటంటే.... నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అజయ్ దేవగన్ అని చెప్పింది. అజయ్ దేవగన్ నాకు 25 ఏళ్లగా తెలుసు. మా కజిన్ ఇంటిపక్కనే అజయ్ కూడా ఉండేవాడు. ఇక అక్కడ ఉన్న అజయ్ నా వెనకాల ఫాలో అయ్యేవాళ్ళని, నన్ను అల్లరి పెట్టేవాళ్ళని పట్టుకుని కొట్టేవాడు. అందుకే నేను అజయ్ కోసమే ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానంటూ చెప్పింది.

అయితే ఇప్పుడు టబు, అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న గోల్ మాల్ ఎగైన్ లో నటిస్తుంది. మరి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా తన పెళ్లి విషయమై స్పందించింది. ఇకపోతే అజయ్ దేవగన్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కితాబునిచ్చేసింది. మరి టబు చేసిన ఈ సరదా వ్యాఖ్యలను అజయ్ వైఫ్ కాజల్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

Similar News