ఆయన కోపం నాకు మంచి జ్ఞాపకం

Update: 2017-12-26 08:23 GMT

టాలీవుడ్ లో చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి మధ్య బంధం కన్నా స్నేహమే ఎక్కువగా ఉంటుంది. సినిమాలు, రాజీకీయాల్లో తోడుగా వున్న సంగతి తెలిసిందే. తనను నమ్మి చిరంజీవి గారు అనేక బాధ్యతలు అప్పజెప్పారని - వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు తాను శాయశక్తులా కష్టపడ్డానని చెప్పారు. ఓ ప్రముఖ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నాకు చిరంజీవి గారికి విభేదాలు వచ్చినట్లు పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ వాస్తవం కాదని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అనేక సంవత్సరాల పాటు స్నేహాన్ని బంధుత్వాన్ని మెయింటెన్ చేసిన వారు ఎక్కువమంది లేరు. ఉన్నవారిలో కృష్ణారెడ్డి - అచ్చిరెడ్డి, బాపు - రమణ, చిరంజీవి - తాను ఆ కోవకు చెందుతామని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు మా ఇద్దరి మధ్య కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయని.. అవన్నీ నీటిపై గాలి బుడగల వంటివని తమ బంధం పై అవి ప్రభావం చూపలేదని తామిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులమని చెప్పారు.

అలానే నేను మా తండ్రి అల్లు రామలింగయ్య చాలా స్నేహంగా ఉండేవారమని అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఒకసారి నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేశానని దీంతో ఒక్కసారిగా నాన్నగారు ముందుకు ఒరిగిపోయి పట్టుకోసం అద్దానికి చేయి ఆన్చారని.. అపుడు కోపంతో నాన్నగారు తన చెంపపై లాగి పెట్టి కొట్టారని, అసలేం జరిగిందో తనకు అర్థం కాలేదని అరవింద్ ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. నాన్నగారి కోపాలు తనకు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయన్నారు

Similar News