ఆమిర్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అనిపించుకోవడానికి అనర్హుడు

Update: 2016-12-12 09:30 GMT

రంగీలా, లగాన్, రంగ్ దే బసంతి, ఫనా, మంగళ్ పాండే, తారే జమీన్ పర్, గజిని, త్రీ ఇడియట్స్, ధోభీ ఘాట్, పీకే ఇలా ఎన్నో చిత్రాలు కళాకారుడిగా ఆమిర్ ఖాన్ నిబద్ధతని చాటి చెప్పాయి. అందుకే బాలీవుడ్ పరిశ్రమ వర్గాల నుంచి ప్రేక్షకుల వరకు అందరూ ఆమిర్ ఖాన్ ని మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని కొనియాడుతారు. కానీ ఇందుకు ఏకీభవించని ఒక గొంతు ఇప్పుడు లెగిసింది. ఆ గొంతు మరెవరిదో కాదు ఆమిర్ ఖాన్ దే. తనకు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని పిలిపించుకునే అర్హత ఇంకా రాలేదు అని తానే స్వయంగా అభిప్రాయ పడ్డారు. పీకే తరువాత సుదీర్ఘ కాలం పాత్రకు తగ్గ విధంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవటానికి కసరత్తులతో గడిపిన ఆమిర్ ఈ నెల 23 న విడుదల కానున్న తన తాజా చిత్రం దంగల్ చిత్ర ప్రచార కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నాడు.

దంగల్ చిత్ర ప్రచారంలో ప్రెస్ విలేకరులతో ముచట్టిస్తుండగా ఒక విలేకరి ఆమిర్ ఖాన్ ను మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని సంభోధించగా, ఆ విలేకరి ప్రశ్న పూర్తి కాకముందే కాలవ చేసుకుని, "దయ చేసి నన్ను మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అనే బిరుదు తో ప్రాచారం చేయొద్దు. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అంటే ఎవరికీ సాధ్య పడని దానిని ప్రయత్నించి సాధించి చూపగలగాలి. నేను చేసే ఏ పనినైనా నాలాగా, నాకంటే అత్యున్నముగా చేసే వారు చాలా మంది వున్నారు. అందు వలన నాకు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని పిలిపించుకునే అర్హత లేదు. బహుశా నేను ప్రతి సన్నివేశాన్ని ఫ్యాషనేటెడ్ గా చేస్తానేమో, సాంకేతిక నైపుణ్యంపై పెద్దగా శ్రద్ద చూపక సన్నివేశంలో భావోద్వేగం ప్రేక్షకులకు తాకే విధంగా శ్రమిస్తాను. అందు వలెనే నన్ను ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తున్నారని అనుకుంటుంటాను." అని తన పేరుకు ముందు ప్రేమగా చేర్చిన మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ని సున్నితంగా తిరస్కరించారు ఆమిర్ ఖాన్.

Similar News