ఆబ్బె అదేం లేదు... అదంతా పుకారే

Update: 2017-11-01 06:00 GMT

పాపం లావణ్య త్రిపాఠి టైం అస్సలు బాగున్నట్టు లేదు. అందుకే ఆమె సినిమాలన్నీ వరసగా ప్లాప్ అవ్వడమే కాదు... ఆమెపై చీటింగ్ కేస్ కూడా నమోదైనట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి చేతిలో అవకాశాలు లేక అల్లాడుతున్న లావణ్య కి మూడు కోట్లు ఫైన్ వేశారంటూ గత రెండు మూడు రోజులుగా మీడియా లో కథనాలు వెలువడుతున్నాయి. తమిళంలో లావణ్య ఒప్పుకున్న '100 % కాదల్' సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకోవడంతో... లావణ్య వల్ల తాము మూడు కోట్లు నష్టపోయామని దర్శకనిర్మాతలు తమిళఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఆ మూడు కోట్లు లావణ్య నుండి తమకి ఇప్పించాలని వారు కోరడమే కాదు ఆమెని కోలీవుడ్ నుండి బహిష్కరించాలని కూడా ఫిర్యాదుచేసినట్లుగా వార్తలొచ్చాయి.

అయితే లావణ్యకు మూడు కోట్ల ఫైన్ వేశారన్న విషయంలో ఎట్టకేలకు లావణ్య స్పందించింది. తనకు మూడు కోట్ల ఫైన్ వేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. తనకు ఎవరు ఎటువంటి ఫైన్ వెయ్యలేదని... నా మీద వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని... కొట్టిపారేసింది. మరి అటు కోలీవుడ్ మీడియాతో పాటే... ఇటు సోషల్ మీడియాలో కూడా లావణ్య కి మూడు కోట్లు ఫైన్ వేసిన విషయాన్నీ ప్రముఖంగానే ప్రచురించాయి. మరి ఇప్పుడు లావణ్య కూల్ గా అలాంటిదేం లేదని చెబుతుంది.

Similar News