ఆ హీరో కెరీర్ లో ఇదే టాప్!!

Update: 2017-07-17 04:44 GMT

నితిన్ తన కెరీర్‌ మొదట్లో హీరోగా టీనేజ్‌ వయసులో డ్రీమ్‌బోయ్‌గా అలరించినప్పటికీ తర్వాత మాస్‌ పిచ్చి పట్టి రెంటికి కొరగాకుండా దాదాపు డజన్‌ చిత్రాల దాకా ఫెయిల్యూర్స్‌ని మూటగట్టుకున్నాడు. కానీ ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డికి ఉన్న సినీ అనుభవం, పరిచయాలు, ఆర్ధిక బలం వల్ల మరలా తనదైన శైలిలో విక్రమ్‌కెకుమార్‌ వంటి క్రియేటివ్‌ దర్శకుడిని ఎంచుకుని 'ఇష్క్‌'తో మరలా గాడిలో పడ్డాడు. ఆ తర్వాత ఇక పవన్‌ని పట్టుకుని సాగిపోతూనే ఉన్నాడు. మరలా రెండు మూడూ ఫ్లాప్‌లొచ్చినా పెద్దగా ఎఫెక్ట్‌ పడలేదు. ఆయన కిందటి చిత్రం 'అ..ఆ'తో 50కోట్ల క్లబ్‌లో చేరాడు.

కానీ ఆ క్రెడిట్‌ ఆయనకు గాకుండా త్రివిక్రమ్‌, సమంతల ఖాతాలోకి వెళ్లింది. ఇక 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సమయంలోనే 14రీల్స్‌ సంస్థ దర్శకుడు హనురాఘవపూడిలోని టాలెంట్‌ని చూసి తదుపరి చిత్రానికి కూడా అతనితో అగ్రిమెంట్‌ చేయించుకోవడం నితిన్‌కి వరమైంది. ఎందుకంటే వారు హను రాఘవపూడితో చేయాలనుకున్న చిత్రం నితిన్‌తోనే కావడం. ఇదే కాస్తైనా లెక్క తప్పి ఉంటే అక్కినేని అఖిల్‌ నటించే రెండో చిత్రమే హను రాఘవపూడి ఖాతాలో పడేది. ఇక 14 రీల్స్‌, హానురాఘవపూడి, కొత్త అమ్మాయి మేఘాఆకాష్‌, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌లతో ఈ చిత్రం చేస్తుండటం, అందులో నితినే హీరో కావడం నితిన్‌కి కలిసొచ్చింది.

ఇక నిర్మాతలు బడ్జెట్‌కి వెనుకాడకుండా ఉండటం, వారికి బల్క్‌డేట్స్‌ ఇచ్చి నితిన్‌ సహకరించడంతో రెండు నెలలు అమెరికాలో షూటింగ్‌ జరిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రంలో గడ్డంతో డిఫరెంట్‌ గెటప్‌తో కనిపిస్తున్న నితిన్‌ పాతబస్తీ కుర్రాడిగా నటిస్తున్నాడని చెబుతూనే అమెరికాలో షూటింగ్‌ జరపడం, కథానుసారమే అమెరికాలో, హైదరాబాద్‌ పాత బస్తీలో షూటింగ్‌ చేస్తుండటం చూస్తూంటే.. అందునా 'లై' అనే టైటిల్‌ ద్వారా కూడా ఈ చిత్రం మంచి ఆసక్తిని రేపుతోంది. ఆగష్టు11న విడుదలకు సిద్దమవుతోన్నఈ చిత్రం తన ఓన్‌ స్టామినాతో 50కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందని నితిన్‌ ధీమాగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం రిలీజ్‌కు ముందే శాటిలైట్‌ హక్కుల కోసం పోటీ ఏర్పడటం, ఏకంగా 7 కోట్లు పలుకుతుండటంతో ఇదే నితిన్‌ కెరీర్‌ ఫస్ల్‌ టాప్‌ పొజిషన్‌లో ఉందని అంటున్నారు.

Similar News